ఆనంద్ మహీంద్రా మెచ్చిన కాఫీ మగ్.. అందులో ఏముందబ్బా!

ఆనంద్ మహీంద్రా ఇది పరిచయం అక్కర్లేని పేరు.సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు.

ఏదైన మంచి వీడియో దొరికతే చాలు వెంటనే షేర్ చేసేస్తారు.తన వీడియోల ద్వారా నెటిజన్లకు స్ఫూర్తినిస్తుంటారు.

ఆయన షేర్ చేసే వీడియో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.ఆయన వీడియోల కోసం ఎంతో మంది ఎదురుచూస్తుంటారు… తాజాగా ఆయన పెట్టిన ఓ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఆ ఫొటో ఆనంద్ మహీంద్రాకు తెగ నచ్చేసిందట.ఇంతకు ఆ ఫొటోలో ఏముందంటే.

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఒక కాఫీ మగ్గు ఫొటో.ఆ ఫొటోపై టిక్ టాక్ టో గేమ్ వేసి ఉంది.

దాని మీద ‘థింక్ అవుట్ సైడ్ ది బాక్స్’ అని రాసి ఉంది.

అందులో బాక్స్ అనే పదంలోని ఎక్స్(X), బాక్స్ లలో ఉండే క్రాస్ సింబల్ తో కలిపేసినట్లు ఉంటుంది.

ఈ ఫొటో ఆనంద్ మహీంద్రాకు తెగ నచ్చేసింది.దీంతో ఆ ఫొటోను షేర్ చేస్తూ ‘నేను ఈ మగ్ ను తెప్పించుకోబోతున్నాను.

తెలివగా చేశారు.కొన్ని సార్లు మన సమస్యలకు పరిష్కారం పరిధిని దాటితేనే దొరుకుతుంది’ అంటూ రాసుకొచ్చారు.

ఆనంద్ మహీంద్రా చేసిన ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ అయ్యింది.అందేకాదు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

మంచి సందేశం ఉండేలా ఈ ట్వీట్ ఉంది.ఒక్కోసారి మన సమస్యకు పరిష్కారం దొరకదు.

అప్పుడు సమస్యలోనే ఉండిపోకుండా పరిధిని దాటి ఆలోచించాలి.అప్పుడే సమస్య నుంచి బయటపడతారనే సందేశం ఇచ్చేలా ఆనంద్ మహీంద్రా ట్వీట్ ఉంది.

నెటిజన్లు కూడా ఎంతో మంచి సందేశం ఇచ్చారంటూ రీట్వీట్లు చేస్తున్నారు.ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో నెటిజన్ల మనుసు దోచుకుంటూ వైరల్ అవుతోంది.

ఆ బాలీవుడ్ స్టార్ హీరో వల్లే ప్రభాస్ రాజసాబ్ లేటవుతుందా..?