అర‌రే..అర‌టి తొక్క ప‌డేస్తున్నారా..ఇలా వాడేస్తే స‌రి!

ఆరోగ్య వంత‌మైన పండ్ల‌లో అర‌టి పండు ముందుంటుంది.అలాగే ప్ర‌పంచ‌వ్యాప్తంగా కూడా అర‌టి పండు వినియోగం ఎక్కువే అన‌డంలో సందేహం లేదు.

అర‌టి పండు ధర కూడా త‌క్కువే.అయితే అర‌టి పండు విష‌యంలో దాదాపు అంద‌రూ చేసే పొర‌పాటు.

లోప‌ల ఉండే పండు తినేసి పై తొక్క‌ను డ‌స్ట్ బిన్‌లో వేసేస్తారు.కానీ, అర‌టి పండుతోనే కాదు అర‌టి తొక్క‌తో కూడా అనేక బెనిఫిట్స్ ఉన్నాయి.

తిని పారేసే అర‌టి తొక్క‌ను ర‌క‌ర‌కాలుగా విన‌యోగించుకోవ‌చ్చు.అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధార‌ణంగా మ‌ట‌న్ త్వ‌ర‌గా ఉడ‌క‌దు.అయితే మ‌ట‌న్ వండే స‌మ‌యంలో అర‌టి తొక్క‌ను వేస్తే చాలా త్వ‌ర‌గా కుక్ అయిపోతుంద‌ట‌.

అలాగే వెండి, స్టీల్ వ‌స్తువుల‌పై అప్పుడ‌ప్పుడూ మ‌ర‌క‌లు ఏర్ప‌డ‌తాయి.వీటిని డిష్ వాషుల‌తో తోమినా ఫ‌లితం ఉండ‌దు.

అయితే అర‌టి తొక్క‌ల‌తో ముందు తోమేస ఆ త‌ర్వాత విష్ వాష్ తో క్లీన్ చేస్తు ఆ వ‌స్తువులు త‌ళ‌త‌ళా మెరుస్తాయి.

"""/"/ మొక్క‌ల‌కు అర‌టి తొక్క‌ల‌ను ఎరువుగా కూడా వేసుకోవ‌చ్చు.అర‌టి తొక్క‌లో ఉండే ప‌లు పోష‌కాలు మొక్క‌ల పెరుగు ద‌ల‌కు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

అలాగే దోమ‌లు కుట్టినా, ద‌ద్దుర్లు ఏర్ప‌డినా, ఏవైనా గాయాలు అయినా అర‌టి తొక్క‌తో చ‌ర్మంపై రుద్దితే వాపు, నొప్పి వంటి స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.

ఇక కొంద‌రు దంతాలు ప‌సుపు రంగులో ఉంటాయి.ఎంత శుభ్రంగా దాంతాల‌ను తోముకున్నా ఎన్ని టూత్ పేస్టులు మార్చినా ఫ‌లితం ఉండ‌దు.

అయితే అర‌టి పండు తొక్క‌తో దంతాల‌పై ఒక రెండు లేదా మూడు నిమిషాలు రుద్ది ఆ త‌ర్వాత వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.

ఇలా క్ర‌మంగా చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.అలాగే త‌ల‌నొప్పిను త‌గ్గించ‌డంలోనూ అర‌టి పండు తొక్క‌ ఉప‌యోగ‌ప‌డుతుంది.

అర‌టి పండు తొక్క‌ను ఫ్రిజ్‌లో అర గంట పెట్టి ఆ త‌ర్వాత దానిని నుదిటిపై పెట్టుకోవాలి.

ఇలా చేస్తే త‌ల‌నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం పొందుతారు.

జొన్న పంటలో పోషక ఎరువుల యాజమాన్యంలో పాటించాల్సిన మెళుకువలు..!