అమెరికాలో...ప్రజాప్రతినిధిగా. "భారతీయ మహిళ"
TeluguStop.com
అమెరికాలో భారత సంతతి మహిళా ఎన్నారై చరిత్ర సృష్టించింది.ఎవరూ ఊహించని విధంగా అక్కడి చట్టసభలలో రికార్డు బ్రేక్ చేసింది.
ఆమె పేరు సుశీల జైపాల్.సుశీల జైపాల్ ఎవరో కాదు.
అమెరికాలో హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్ ప్రతినిధిగా ఎంపికైన తొలి భారతీయ మహిళ ప్రమీల జైపాల్ చెల్లెలు.
అయితే సుశీల జైపాల్ ఆరెగన్ రాష్ట్రం నుండీ ప్రజాప్రతినిధిగా ఎంపికై రికార్డు సృష్టించింది.
ఆరెగన్ రాష్ట్రంలోని మల్టనోమ్హా కౌంటీలో ఉత్తర, ఈశాన్య పోర్టుల్యాండ్ కమిషనర్‌గా ఆమె ఎన్నికయ్యారు.
ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారత మహిళా ఇమే కావడం గమనార్హం. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
ఇదిలాఉంటే ‘57 శాతం' ఓట్లతో మా చెల్లెలు సుశీలా జైపాల్ ఒరెగాన్ రాష్ట్రంలో మల్టనోమ్హా కౌంటీ బోర్డు ఆఫ్ కమిషనర్స్‌లో సభ్యురాలిగా ఎన్నికయారు.
ఒరెగాన్‌లో ఎన్నికైన మొదటి దక్షిణాసియా అమెరికన్‌గా ఆమె రికార్డు నమోదు చేశారు అని అంటూ సుశీల అక్క పార్లమెంటు సభ్యురాలు ప్రమీల ట్వీట్ చేశారు.
అయితే గతంలో సుశీల కార్పొరేట్ లాయర్‌గా పనిచేసి ఎంతో కాలంగా కమ్యూనిటీ వలంటీర్‌గా పని చేస్తూ వచ్చారు సుశీలకి రాజకీయాలు కొత్త కావడం విశేషం ఆరెగన్‌లోని స్థానిక మీడియాతో ఆమె మాట్లాడుతూ.
ఇళ్లు లేనివారికి గూడు కల్పించడమే తన ముఖ్య లక్ష్యంగా తెలిపారు.అందుకోసం ఆమె అంబూడ్స్‌మెన్‌లో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.
16 ఏళ్ల ప్రాయంలో అమెరికా వెళ్లిన సుశీల ఆర్థికశాస్త్రంలో పట్టా తీసుకున్నారు.తరువాత న్యాయవిద్య అభ్యసించారు.
ఏది ఏమైనా సరే ఒక భారత సంతతి మహిళ ఈ రికార్డు అమెరికాలో నెలకొల్పడం ఎంతో సంతోషంగా ఉందని అంటున్నారు ఎన్నారైలు.
బాలయ్య డాకు మహారాజ్ సినిమాతో భారీ సక్సెస్ కొట్టడా..?