అధికారులపై చర్యలు తీసుకోవాలి

సూర్యాపేట జిల్లా:నేరేడుచర్ల మున్సిపల్ పరిధిలో సమీకృత వెజ్ మరియు నాన్ వెజ్ మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రోటోకాల్ నిబంధనలు పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ 8వ వార్డు కౌన్సిలర్ కొదమగుండ్ల సరితా నగేష్ డిమాండ్ చేశారు.

బుధవారం నాడు నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని జాన్ పహాడ్ రోడ్ లోగల ఎన్ఎస్పి క్యాంపు నందుగల ప్రజల సౌకర్యార్థం 3 కోట్ల 90 లక్షలరూపాయలతో నిర్మించతలపెట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ శంకుస్థాపనలో కౌన్సిల్ సభ్యులను అవమానపరిచే విధంగా అధికారులు వ్యవహరించారని శిలాఫలకం దగ్గర, శంకుస్థాపన దగ్గర,కనీసం కౌన్సిలర్ల పేరు పెట్టి పిలవలేదని అందరినీ ఒకే సారి కౌన్సిల్ సభ్యులు అందరూ వచ్చి కొబ్బరికాయలు కొట్టాలని పిలవడం అవమానకరంగా ఉన్నదని ఆమె అన్నారు.

అనంతరం జరిగిన సభా వేదికపైకి కౌన్సిలర్లు వచ్చి కూర్చోవాలని చెప్పడం కౌన్సిలర్లను పేరు పెట్టి పిలవలేదని, అవమానపరిచే విధంగా ఉందని ఆమె అన్నారు.

మున్సిపాలిటీకి సంబంధించి సంబంధంలేని ప్రజాప్రతినిధులను వేదికపై ముందువరుసలో కూర్చోబెట్టి కౌన్సిల్ సభ్యులను వెనుక భాగాన కూర్చోబెట్టడం నిబంధనలకు విరుద్ధంగా అవమానకరంగా ఉన్నదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రోటోకాల్ నిబంధనలు పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

అమ్మవారి దీక్షలో ఉంటూ చెప్పులు వేసుకున్న పవన్.. ఆ మాత్రం తెలియదా అంటూ ట్రోల్స్!