రక్తహీనతకు దూరంగా ఉండాలనుకుంటే ఖచ్చితంగా దీన్ని డైట్ లో చేర్చుకోండి!

రక్తహీనతఇటీవల రోజుల్లో కోట్లాది మందికి కామన్ శత్రువుగా మారుతుంది.రక్తహీనత అనుకున్నంత చిన్న సమస్య ఏమీ కాదు.

దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఎన్నో ఇబ్బందుల‌ను ఫేస్ చేయాల్సి ఉంటుంది.ముఖ్యంగా రక్తహీనత బారిన పడ్డవారు.

ఎప్పుడూ నీరసంగా, అలసటగా మరియు మూడీగా కనిపిస్తారు.ఏ విషయం పైన ఇంట్రెస్ట్ చూపలేకపోతుంటారు.

అలాగే రక్తహీనత వల్ల బరువు బాగా పెరగడం లేదా తగ్గడం జరుగుతుంటుంది.రోగనిరోధక వ్యవస్థ బలహీనపడడం, తరచూ కళ్లు తిరగడం, ఆకలి మందగించడం తదితర లక్షణాలన్నీ రక్తహీనత వల్ల కనిపిస్తుంటాయి.

వీటన్నిటికీ చెక్ పెట్టి రక్తహీనతను నివారించుకోవాలనుకుంటే తప్పకుండా ఇప్పుడు చెప్పబోయే లడ్డూను డైట్ లో చేర్చుకోవాల్సిందే.

ఈ లడ్డును రోజుకు ఒకటి చొప్పున‌ ప్రతిరోజు తీసుకుంటే రక్తహీనతకు దూరంగా ఉండొచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ లడ్డూను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసి పొడిలా గ్రైండ్‌ చేసుకోవాలి.

ఆ తర్వాత అదే మిక్సీ జార్ లో ఒక కప్పు గింజ తొలగించిన ఎండు ఖర్జూరాలు వేసి పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.

ఇక చివ‌ర‌గా ప‌దిహేను బాదం పప్పులు, ప‌దిహేను పిస్తా పప్పులు, ప‌దిహేను జీడిపప్పులు, రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకుని పొడిలా గ్రాండ్ చేసుకోవాలి.

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న నట్స్ పొడి, కొబ్బరి పొడి, ఎండు ఖర్జూరం పొడి వేసి మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు బాగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి.

"""/"/ ఆపై అదే పాన్ లో ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి.

నెయ్యి కాస్త హీట్ అవ్వగానే ఒక కప్పు బెల్లం తురుము వేసి కరిగించాలి.

బెల్లం కరిగిన వెంటనే వేయించి పెట్టుకున్న పొడులను వేసి బాగా మిక్స్ చేసి లడ్డూల మాదిరిగా చుట్టుకోవాలి.

ఈ లడ్డూలను ఒక బాక్స్ లో నింపుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.

రోజుకొకటి చొప్పున ఈ లడ్డూలను ప్రతిరోజూ తీసుకుంటే హిమోగ్లోబిన్ పరిమాణం పెరుగుతుంది.దీంతో రక్తహీనత సమస్య దూరం అవుతుంది.

రక్తహీనత లక్షణాల నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది.కాబట్టి రక్తహీనతతో సతమతమయ్యేవారు తప్పకుండా ఈ ల‌డ్డూను డైట్లో చేర్చుకోండి.

వాళ్లను తక్షణమే అన్ ఫాలో చేయండి.. నెటిజన్లకు సీపీ సజ్జనార్ సూచనలు ఇవే!