మోడీ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

నల్లగొండ జిల్లా:నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్పొరేటు వ్యవసాయ అనుకూల చట్టాలను రద్దు చేయాలని,రైతులు సంవత్సరం పాటు నిర్వహించిన నిరవధిక ఉద్యమంలో భాగంగా మోడీ ప్రభుత్వం రైతు చట్టాలను రద్దు చేస్తున్నామని,ఉద్యమంలో చనిపోయిన రైతు కుటుంబాలను ఆదుకుంటామని, హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు రైతు చట్టాలను పార్లమెంటులో రద్దు చేయకపోగా,కనీసం ఉద్యమంలో చనిపోయిన రైతులను ఆదుకోవడంలో విఫలమైనందున దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా,అఖిల భారత రైతు సంఘాల పిలుపులో భాగంగా రైతు విద్రోహ దినం పాటిస్తూ నకిరేకల్ పట్టణంలో ఏ.

ఐ.కె.

యం.ఎస్ ఆధ్వర్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

ఈ సందర్భంగా సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాయి కృష్ణ, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు జ్వాల వెంకటేశ్వర్లు,పుట్టా సత్యం మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని,కార్పొరేట్,బహుళజాతి సంస్థలకు వ్యవసాయ రంగాన్ని కట్టబెట్టడం కోసం తీవ్ర ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.

అందులో భాగంగానే రైతు వ్యతిరేక చట్టాలను తీసుకు వచ్చిందని,దీనికి వ్యతిరేకంగా పోరాటాలు చేసిన రైతులను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవడంలో విఫలమైందని,రద్దు చేస్తానని ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.

వ్యవసాయ రంగానికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందించి వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలని వారు డిమాండ్ చేశారు.

రైతు వ్యతిరేక కార్పొరేట్ అనుకూల చట్టాలను తక్షణమే పార్లమెంట్లో రద్దు చేస్తున్నట్లు ప్రకటించాలని,రైతు ఉద్యమంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్సగ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఇఫ్టూ రాష్ట్ర కార్యదర్శి రాచకొండ జనార్దన్,పీవోడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జి.

అనసూయ,పి.వై.

యల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇందూరు సాగర్,సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నల్లగొండ జిల్లా నాయకులు బొమ్మిడి నగేష్,ఉపేంద్ర,సోమన్న,చారి,గంట నాగన్న,ఆర్ సీత,మామిడి వెంకన్న,కిరణ్,మధు,కమల్ల నవీన్ తదితరులు పాల్గొన్నారు.

ఇదెలా సాధ్యం బాస్.. కర్చీఫ్ ను అలా ఎలా పాములా మార్చేసావ్?