అస్పష్టంగా,అబద్ధాలతో కేసీఆర్ ఉద్యోగ నియామకాలు,ఖాళీల ప్రకటన -ధర్మార్జున్

సూర్యాపేట జిల్లా:ఈరోజు సీఏం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన 80,039 ఉద్యోగాల భర్తీ మరియు ఖాళీల ప్రకటన అస్పష్టత, అబద్దాలతో కూడుకొని ఉందని టీజేఏస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,సూర్యాపేట నియోజకవర్గ ఇంచార్జి ధర్మార్జున్ ఆరోపించారు.

బుధవారం అసెంబ్లీలో సీఏం చేసిన ప్రకటనపై స్పందిస్తూ రెండు సంవత్సరాల క్రితం బిస్వాల్ కమిటీ 1,91,000 ఉద్యోగాలు ఖాళీగ ఉన్నాయని ప్రకటించింది.

కానీ,నేడు కేసీఆర్ 80,039 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేస్తామని అంటే ఏంటని,మిగతా ఒక లక్ష ఉద్యోగాలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు.

దీంతో ఖాళీగా ఉన్న ఉద్యోగాల సంఖ్యను కుదించి ప్రభుత్వం దాచిపెడుతుందని అర్థమవుతుందని,ఈ మిగిలిన లక్ష 10 వేల ఉద్యోగాలకు కూడా వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలన్నారు.

గత 8 సంవత్సరాలలో కేసీఆర్ ప్రభుత్వం కొత్తగా భర్తీ చేసిన ప్రభుత్వ ఉద్యోగాలు 78 వేలలోపే ఉన్నవని,కానీ,విద్యుత్ శాఖలో, ఆర్టీసీలో, సింగరేణిలో రెగ్యులరైజ్ చేసిన ఉద్యోగాలను కలిపి 1,33,000 ఉద్యోగాలు భర్తీ చేశామని అబద్దాలు ప్రచారం చేసుకుంటుందన్నారు.

సీఏం కేసీఆర్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ అస్పష్టంగా ఉందని,దీనిలో స్పష్టత కరువైందని,ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఎప్పటి వరకు పూర్తవుతుందో డెడ్ లైన్ లేదని, ‌డెడ్ లైన్ లో భర్తీ కాకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి జాబ్ క్యాలెండర్‌ కి చట్టబద్దత ఉండాలని అన్నారు.

కానీ, సీఏం ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌ కి చట్టబద్దత లేదని,వెంటనే చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేస్తున్నామని తెలిిిపారు.

మరోవైపు 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తమని ప్రకటించారని,ఏయే శాఖలలోని వారిని చేస్తారో స్పష్టత ఇవ్వలేదని, వేలాదిమంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉంటే కేవలం 11 వేలమందినే రెగ్యులరైజ్ చేయడంలో మతలబు ఏందన్నారు? గత ఎన్నికలలో ఇచ్చిన నిరుద్యోగ భృతి  హామీ గురించి పూర్తిగా మరిచిపోయారని,బడ్జెట్ లో నిరుద్యోగ భృతికి నిధులు విడుదల చేయలేదని,ఉద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఉద్యోగ,ఉపాధి కల్పన విషయంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల గత ఎనిమిది సంవత్సరాలలో 200 మంది నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదని ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

వీరి గురించి కూడా ఈరోజు సీఏం కేసీఆర్ మరిచిపోయారని, చనిపోయిన నిరుద్యోగుల కుటుంబాలకు రూ.

25 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలన్నారు.వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ధర్మార్జున్ డిమాండ్ చేశారు.

విలీనాలు తెలంగాణ రాజకీయాల్లో కొత్తేమీ కాదు .. బీఆర్ఎస్ కంగారుపడుతోంది