తెలుగు గడ్డపై ఓపెన్ అయిన థియేటర్.. ఏకంగా ఆ సినిమానే విడుదల?

ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఎంతలా ఉందో చూస్తూనే ఉన్నాం.రోజురోజుకు కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే.

 Telugu States Theaters Opened After Corona Second Wave Lock Down, Corona Second,-TeluguStop.com

పలు రంగాలు, సినీ ఇండస్ట్రీలు, థియేటర్లు, రాకపోకలు వంటి వాటిని నిలిపివేశారు.ఇక ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడంతో కొంత సమయం వరకు లాక్‌డౌన్‌ లోని ఎత్తివేశారు.

ఇదిలా ఉంటే తాజాగా ఓ చోట థియేటర్ ఓపెన్ చేశారు.

గతంలో తెలుగు రాష్ట్రాల లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో అన్ని నిలిపివేశారు.

ఇక సినీ ఇండస్ట్రీలు కూడా మూతపడగా థియేటర్స్ లో కూడా ఎటువంటి కలెక్షన్లు ఉండకపోవడంతో థియేటర్లు కూడా మూతపడ్డాయి.ఇక తిరిగి ప్రస్తుతం కొంత వరకు కాస్త విరామ సమయాన్ని ప్రజలకు అందించగా ఆ సమయంలో కావలసిన నిత్యవసర వస్తువులు, కొన్ని ప్రయాణాలకు అనుమతినిచ్చారు.

దీంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో జగదాంబ థియేటర్ తెరుచుకోగా.అందులో సంక్రాంతి హిట్ మూవీ క్రాక్ సినిమాను చూపిస్తున్నారు.

Telugu Andhra Pradesh, Ap, Corona, Extended Lock, Krack, Raviteja, Telugu, Visha

ఇటీవలే మరో పది రోజులు లాక్ డౌన్ పొడిగించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు అన్నీ సదుపాయాలకు అవకాశం ఇచ్చారు.దీంతో మరో రెండు గంటల సమయాన్ని పొడిగించగా ఈ నేపథ్యంలో జగదాంబ థియేటర్ యాజమాన్యం మార్నింగ్ షో ను నడిపించడానికి ఏర్పాట్లు చేశారు.దీంతో ఈ షో ఉదయం పదిన్నర నుండి ఒంటి గంట వరకు ప్రదర్శిస్తున్నారు.ప్రస్తుతం అన్ని చోట్లలా కాస్త సమయాన్ని కేటాయించగా థియేటర్లు మాత్రం బంద్ అయ్యే ఉన్నాయి.

కేవలం ఈ ఒక్క థియేటర్ మాత్రమే తెరుచుకోవడం తో ఈ లాక్ డౌన్ సమయంలో నడుస్తున్న ఏకైక థియేటర్ గా మారింది.ఇక అన్ని చోట్లలో థియేటర్లను జూన్ ఆఖరి వారం లేదా ఆగస్టు మొదటి వారంలో తెరుచుకోనున్నట్లు వార్తలు వినిపించాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube