మరోసారి భేటీ కి సిద్దమైన తెలుగు రాష్ట్రాల సీఎం లు,కారణం!  

Telugu States Cm\'s Meeting On 24th September-telugu States Cm\\'s

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి భేటీ అయ్యేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది.ఇప్పటికే పలు మార్లు సమావేశమైన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ నెల 24 న మరోసారి హైదరాబాద్ లో భేటీ కానున్నట్లు తెలుస్తుంది.అయితే ఈ సారి ఎజెండా మారినట్లు తెలుస్తుంది.ఇప్పటికే ఉమ్మడి రాష్ట్రాల ప్రాజెక్టులపై చర్చించిన ముఖ్యమంత్రులు తాజాగా నదుల అనుసంధానంపై చర్చించనున్నట్లు తెలుస్తుంది.ఈ నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్,అలానే తెలంగాణ సీఎం కేసీఆర్ లతో పాటు పలువురు మంత్రులు, అధికారులు ఈ భేటీకి హాజరుకానున్నారు.

Telugu States Cm\'s Meeting On 24th September-telugu States Cm\'s-Telugu States CM's Meeting On 24th September-Telugu Cm\'s

గత సమావేశాల్లో విభజన సమస్యలతో పాటూ ఇరిగేషన్ ప్రాజెక్టులు, నీటి పంపకాలపై చర్చించనున్నట్లు తెలుస్తుంది.ఇప్పుడు గోదావరి జలాలను శ్రీశైలానికి ఎలా తరలించాలనే అంశంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చిస్తారని తెలుస్తోంది.

Telugu States Cm\'s Meeting On 24th September-telugu States Cm\\'s-Telugu States CM's Meeting On 24th September-Telugu Cm\\'s

తెలంగాణ భూభాగం నుంచి గోదావరి నీటిని తరలించాలని ఏపీ ఇంజనీర్లు, ఏపీలో మరో రిజర్వాయర్ నిర్మాణం చేస్తూ.కాల్వలను వెడల్పు చేయడం ద్వారా నీటిని నాగార్జునసాగర్, అక్కడి నుంచి శ్రీశైలం తరలించవచ్చునని తెలంగాణ అధికారులు వేర్వేరు ప్రతిపాదనలు రూపొందించారు.ఒకరి ప్రతిపాదనలు ఒకరికి నచ్చకపోవడంతో ఈ అంశం అప్పటికి ఆగిపోయింది.దీనిపై ఇప్పుడు కేసీఆర్ పట్టుబడుతున్నట్టు సమాచారం.