ఈ స్టార్ హీరోలకి నటన నేర్పించిన గురువు ఎవరో తెలుసా..?

టాలీవుడ్ లో స్టార్ హీరోలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రిన్స్ మహేష్ బాబు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తదితరులు తమ నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు.దీంతో వీరి చిత్రాలకి సౌత్ ఇండియాలో విశేషమైన క్రేజ్ ఉంది.

 Telugu Star Maker Satyanand About Pawan Kalyan And Prabhas-TeluguStop.com

అయితే ఈ స్టార్ హీరోలకి నటన పరంగా మెలుకువలు నేర్పించి శిక్షణ ఇచ్చినటువంటి టాలీవుడ్ ప్రముఖ స్టార్ మేకర్ “సత్యానంద్” గురించి మాత్రం ఇప్పటికీ చాలామంది ప్రేక్షకులకి తెలియదు.అయితే కొంతమందికి స్టార్ మేకర్ సత్యానంద్ అంటే పెద్దగా తెలియకపోవచ్చు గానీ “ఒక క్రిమినల్ ప్రేమ కథ” చిత్రంలో హీరోయిన్ “మావయ్య” పాత్రలో నటించిన నటుడంటే మాత్రం ఇట్టే గుర్తు పడతారు.

కాగా తాజాగా నటుడు సత్యానంద్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.

 Telugu Star Maker Satyanand About Pawan Kalyan And Prabhas-ఈ స్టార్ హీరోలకి నటన నేర్పించిన గురువు ఎవరో తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇందులో భాగంగా తాను ఇప్పటివరకు దాదాపుగా 100 మందికి పైగా హీరోలకి నటనలో శిక్షణ ఇచ్చానని తెలిపాడు.

అంతేకాకుండా తన శిక్షణ అకాడమీలో శిక్షణ తీసుకున్న మరో 70 మంది నటీనటులు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పేరున్న ఆర్టిస్టులుగా రాణిస్తున్నారని తెలిపాడు.అయితే తాను ఒకప్పుడు శిక్షణ ఇచ్చిన హీరోలు ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోలుగా కొనసాగుతున్నారని దాంతో తనకు చాలా ఆనందంగా ఉందని ఎమోషనల్ అయ్యాడు.

అంతేకాక నేటితరం హీరోల్లో కూడా తన స్టూడెంట్లు ఉన్నారని ఇందులో తనకు మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రియమైన స్టూడెంట్ అని తెలిపాడు.అయితే సాయి తేజ్ కి నటన పరంగా చాలా ప్రతిభ ఉందని అంతేకాకుండా తనను తాను నిరూపించుకోవడానికి సాయి ధరమ్ తేజ్ చాలా కష్ట పడతాడని చెప్పుకొచ్చాడు.

ఇక తన శిక్షణ అకాడమీలో ఎవరిని పడితే వాళ్లని అసలు చేర్చుకోమని ముందుగా నటుడికి కావాల్సిన లక్షణాలు విద్యార్థిలో ఉన్నాయా లేదా అని పరీక్షించిన తర్వాతే తమ అకాడమీలో విద్యార్థులని చేర్చుకుంటామని స్పష్టం చేశాడు.ఒకవేళ ఎవరైనా విద్యార్థి తమ శిక్షణ అకాడమీలో చేరడానికి వచ్చినప్పుడు నటుడికి కావలసిన అర్హతలు, లక్షణాలు లేకపోతే నిర్మొహమాటంగా నటుడిగా పనికిరావు అని చెప్పి వెనక్కి పంపిస్తామని కూడా తెలిపాడు.అలాగే మనిషి జీవితంలో సమయం, డబ్బు రెండూ చాలా విలువైనవని డబ్బు కోసం ఇతరుల సమయాన్ని వృధా చేయడం మరియు మోసం చేయడం వంటివి తనకు ఇష్టముండదని చెప్పుకొచ్చాడు.అయితే టాలీవుడ్ లో ఎంతో మందిని హీరోలుగా తీర్చిదిద్దిన సత్యానంద్ మాత్రం వెండి తెరపై చాలా తక్కువగా కనిపించాడు.

#TeluguStar #Pawan Kalyan #Prabhas #Mahesh Babu #Satyanand

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు