ఒక్క కేజీఎఫ్‌ తో అతడిని ఇంతగా నమ్మడం అవసరం అంటారా?

Telugu Star Heros Very Match Believe Kgf Director Prashanth Neel

కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్‌ పేరు ప్రస్తుతం మారు మ్రోగుతోంది.అతడు కేజీఎఫ్‌ సినిమా తో ఒక్కసారిగా పాన్ ఇండియా దర్శకుడిగా పేరు దక్కించుకున్నాడు.

 Telugu Star Heros Very Match Believe Kgf Director Prashanth Neel-TeluguStop.com

అతడు ఆ పేరును క్యాష్‌ చేసుకోవడంలో నూటికి నూరు శాతం సక్సెస్‌ అయ్యాడు.ఇప్పటికే కేజీఎఫ్‌ పేరు చెప్పి ప్రభాస్ తో సలార్ వంటి బిగ్గెస్ట్‌ యాక్షన్‌ సినిమాను చేస్తున్నాడు.

సలార్‌ సినిమా వచ్చే ఏడాది ఆరంభం వరకు ముగించబోతున్నాడు.మరో వైపు కేజీఎఫ్‌ 2 సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.

 Telugu Star Heros Very Match Believe Kgf Director Prashanth Neel-ఒక్క కేజీఎఫ్‌ తో అతడిని ఇంతగా నమ్మడం అవసరం అంటారా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఎన్టీఆర్‌ తో ఒక సినిమాను కూడా ప్రశాంత్ నీల్ కన్ఫర్మ్‌ చేసుకున్న విషయం తెల్సిందే.తాజాగా రామ్‌ చరణ్‌ తో కూడా ఒక సినిమాకు సంబంధించిన విషయాలు రివీల్‌ అయ్యింది.

దానయ్య నిర్మాణంలో రామ్‌ చరణ్ హీరోగా ప్రశాంత్ నీల్‌ దర్శకత్వం లో ఒక సినిమా పట్టాలెక్కబోతుంది.

అల్లు అర్జున్ హీరోగా కూడా ప్రశాంత్ నీల్‌ ఒక సినిమాను గీతాఆర్ట్స్ లో చేయాల్సి ఉంది.మొత్తంగా తెలుగు హీరోల్లో ప్రభాస్‌.ఎన్టీఆర్‌.

రామ్‌ చరణ్‌ మరియు అల్లు అర్జున్‌ లతో ప్రశాంత్ నీల్ బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు చేయబోతున్నాడు.మహేష్ బాబు ను కూడా డైరెక్ట్ చేసేందుకు గాను ప్రశాంత్ నీల్‌ అనుమతి దక్కించుకున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఆ విషయమై మరింత స్పష్టత రావడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉంది.ఇంతటి గొప్ప ట్రాక్ రికార్డు ఏ తెలుగు దర్శకుడికి కూడా దక్కలేదు.

రాజమౌళి వంటి స్టార్‌ డైరెక్టర్‌ కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయలేక పోతున్నాడు.ఆయన ఒక్కో సినిమాను రెండు మూడు సంవత్సరాలు చేస్తూ ఒక సినిమా తర్వాత ఒకటి అన్నట్లుగా చేస్తున్నాడు.

ప్రశాంత్ నీల్ మాత్రం ఒకే ఒక్క కేజీఎఫ్ వల్ల ఇంత మందిని నమ్మించి సినిమాను చేసేందుకు ఒప్పించాడు.ఒక్క కేజీఎఫ్‌ సినిమాను చూసి ఇతగాడిని ఇంతగా నమ్మడం ఎంత వరకు సబబు అంటూ కొందరు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

కేజీఎఫ్‌ 2 మరియు సలార్ ల సినిమాల ఫలితాలపై ఇప్పటికే కన్ఫర్మ్‌ అయిన సినిమాల భవితవ్యం కూడా ఉంటుంది.

#Prabhas #Prashanth Neel #Salaar #HerosMatch #KGF

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube