తెలుగు తెలుగు వెంకటేష్ హీరోగా నటించిన “లక్ష్మి” చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ “నయనతార” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు వచ్చీ రావడం తోనే తన అందం, నటనా ప్రతిభ తో ప్రేక్షకులను బాగా అలరించింది.
దీంతో దాదాపుగా సీనియర్ నుంచి జూనియర్ వరకు అందరి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకుని ఇప్పటికీ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల సరసన కొనసాగుతోంది.
అయితే నయనతార సినిమాల పరంగా బాగానే రాణించినప్పటికీ తన వ్యక్తిగత జీవితం విషయంలో మాత్రం సరైన నిర్ణయాలు తీసుకోలేక పోయింది.
ఈ క్రమంలో నయనతార కోలీవుడ్ కి చెందినటువంటి ముగ్గురు హీరోలతో ప్రేమాయణం నడిపింది.ఇందులో అప్పటికే పెళ్లయి పిల్లలు ఉన్నటువంటి ప్రముఖ దర్శకుడు మరియు డాన్స్ కొరియోగ్రాఫర్ ప్రభు దేవా ఒకరు.
అప్పట్లో నయనతార కోసం ప్రభు దేవా ఏకంగా తన భార్య కి విడాకులు ఇచ్చి కొంతకాలం పాటు వీరిద్దరూ సహజీవనం కూడా చేశారు. కానీ ఏమైందో ఏమో ఉన్నట్లుండి ప్రభు దేవాతో నయనతార బ్రేకప్ చెప్పింది.
ఆ తర్వాత కోలీవుడ్ ప్రముఖ హీరో శింబుతో కూడా కొంతకాలం ప్రేమాయణం నడిపింది.దీంతో అప్పట్లో వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పటికీ హీరో శింబు కుటుంబ సభ్యులు అభ్యంతరాలు తెలపడంతో వీరి ప్రేమ కి తెర పడింది.
దాంతో కొంత కాలం పాటు ప్రేమ, గీమ పక్కనపెట్టి తన సినీ కెరీర్ పై దృష్టి సారించింది. ఈ క్రమంలో ఎన్నో కొత్త ప్రయోగాలు చేస్తూ లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.
ఒక రకంగా చెప్పాలంటే నయనతార లవ్ బ్రేకప్ అయిన తర్వాత ఆమె లైఫ్ టర్న్ అయింది.ప్రస్తుతం నయనతార తమిళ ప్రముఖ దర్శకుడు విగ్నేశ్ శివన్ తో సహజీవనం చేస్తోంది.
దీంతో తొందర్లోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నయనతార తెలుగులో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.
కాగా ఇటీవలే నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కిన “అమ్మోరు” చిత్రం ప్రముఖ ఓటిటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైంది. కానీ ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.