తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరిలో విక్రమ్( Vikram ) ఒకరు.వైవిధ్యమైన పాత్రలను పోషించడంలో ఆయనను మించిన వారు మరొకరు లేరు అని చెప్పడం ఎంత మాత్రం శక్తి లేదు.
ఆయన చేసిన ప్రతి పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది.అంతటి వైవిధ్యమైన నటనను కనబరిచే విక్రమ్ కి సరైన పాత్ర అయితే దొరకడం లేదు.
ఇక ఇదిలా ఉంటే విక్రమ్ హీరోగా గౌతమ్ మీనన్ ఘర్షణ సినిమాని( Gharshana Movie ) రీమేక్ చేయాలనుకున్నాడు.తమిళంలో సూర్య ని( Surya ) పెట్టి ‘ఖాఖా ఖాఖా ‘( Kaakha Kaakha ) అనే టైటిల్ తో ఈ సినిమాని తెరకెక్కించారు.ఇక తెలుగులో మాత్రం ఘర్షణ పేరుతో విక్రమ్ తో చేయాలనుకున్నాడు.కానీ అనుకోని కారణాలవల్ల అది వర్కౌట్ అవలేదు.దాంతో వెంకటేష్ ని( Venkatesh ) హీరోగా పెట్టి ఈ సినిమాను చేశాడు.ఇక ఇక్కడ ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
ఇక మొత్తానికైతే తెలుగులో ఒక స్టార్ స్టేటస్ ని అందుకోవాలని ప్రయత్నం చేసిన విక్రమ్ కి ఈ సినిమాతో బ్రేక్ పడిందనే చెప్పాలి.
ఇక అపరిచితుడు సినిమాతో సూపర్ హిట్ ను అందుకొని తన కెరీర్ లోనే బెస్ట్ నటుడిగా గుర్తింపు పొందిన విక్రమ్ తెలుగు లో డైరెక్ట్ గా మాత్రం సినిమా చేయలేకపోయాడు.ఇక ఘర్షణ సినిమా చేసి ఉంటే ఆయనకి ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా పడి ఉండేదని చాలా మంది చెప్తూ ఉంటారు… నిజానికి ఘర్షణ సినిమా విక్రమ్ కి కూడా చాలా బాగా సెట్ అవుతుంది.కానీ ఆయన దురదృష్టం వల్లే ఆయనకి ఈ సినిమా మిస్ అయిందనే చెప్పాలి…ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తంగాలన్ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ తో తొందర్లోనే మన ముందుకు రాబోతున్నాడు…
.