కోట్ల విలువ చేసే ల్యాండ్ కొన్న జూనియర్ ఎన్టీఆర్.... రిజిస్ట్రేషన్ కోసం....

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నందమూరి హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఉన్నటువంటి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే జూనియర్ ఎన్టీఆర్ సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తన నటనా ప్రతిభను నిరూపించుకుని ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ 5 మంది హీరోలలో ఒకరుగా రాణిస్తున్నారు.

 Telugu Star Hero Jr Ntr Purchased Land In Hyderabad-TeluguStop.com

కాగా తాజాగా జూనియర్ ఎన్టీఆర్ దాదాపుగా 6.5 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని కొన్నాడు.దీంతో ఈ భూమి రిజిస్ట్రేషన్ విషయమై రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి లో ఉన్న ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్ళాడు.దీంతో ఒక్కసారిగా ఎన్టీఆర్ ని అభిమానులు చుట్టు ముట్టి సెల్ఫీల కోసం ఎగబడ్డారు.

కాగా ప్రస్తుతం తారక్ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.

 Telugu Star Hero Jr Ntr Purchased Land In Hyderabad-కోట్ల విలువ చేసే ల్యాండ్ కొన్న జూనియర్ ఎన్టీఆర్…. రిజిస్ట్రేషన్ కోసం….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తెలుగులో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న “ఆర్.ఆర్.ఆర్” చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.అలాగే టాలివుడ్ మాటల మాంత్రికుడు “త్రివిక్రమ్ శ్రీనివాస్” తెరకెక్కిస్తున్న మరో చిత్రంలో కూడా హీరోగా నటిస్తున్నాడు అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు మొదలు కావాల్సి ఉండగా ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగులను నిలిపి వేయడంతో ఈ చిత్రాన్ని కొంత కాలం పాటు తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సమాచారం.కానీ ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

మరి అనుకున్న సమయానికి ఈ చిత్రాన్ని విడుదల చేసుతరో లేదో చూడాలి.

#NTRLand #Jr NTR #TeluguStar #Hyderabad

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు