పెళ్ళి అయిన హీరోతో బాయ్ ఫ్రెండ్ ఉన్న తెలుగు హీరోయిన్ ఎఫైర్   Telugu Star Actress In Affair With Bolly Star Hero     2017-10-07   02:17:08  IST  Raghu V

ఆయనొక బాలివుడ్ స్టార్ హీరో. ఈమధ్య సరైన హిట్స్ లేక కాస్త నెమ్మదించాడు కాని, ఫామ్ లో ఉన్న టైమ్ భారీ బ్లాక్ బస్టర్స్ కొట్టాడు. పెద్ద అందగాడేమి కాదు కాని టాలెంట్ నిండిన మనిషి. నటనలోనే కాదు, మాటల్లో కూడా టాలెంట్ ఉన్న మనిషి. ఆ టాలెంట్ తోనే యావత్ భారతదేశ కుర్రాళ్ళు కుల్లుకునేలా ఓ హాట్ హీరోయిన్ ని పడేసాడు. ఆ హీరోయిన్ తెలుగు కుర్రాళ్ళ గుండెల్లో రైళ్ళు పరిగెత్తించిన భామ. ఇద్దరి కలిసి ఇప్పటికే ఓ సినిమా చేసారు. మరో సినిమా హీరో రికమండేషన్ తో త్వరలోనే చేయబోతున్నారు. ఆయనతో సినిమా కోసమని ఓ తెలుగు స్టార్ హీరో సినిమాని వదిలేసుకుంది ఈ హీరోయిన్.

ఆ హీరోకి అల్రెడి పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు. మరి ఆయన భార్య ఏమైనా అల్లటప్ప ఆడదా అంటే కాదు. ఆమె కూడా ఇండస్ట్రీ లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన మనిషే. ఇప్పటికీ, అడపాదడపా కొన్ని సినిమాలు చేస్తుంది. దక్షిణాది ప్రేక్షకులకి కూడా బాగా తెలుసు. ఇక ఆమెకి తెలిసి తెలియని విషయం ఏమిటంటే, ఆవిడ హస్బండ్ ఈ దక్షిణాది నుంచి బాలివుడ్ లో అడుగులేసిన హీరోయిన్ తో ఏవో వంటకాలు వండుతున్నాడు.‌ చాటుమాటున చేయాల్సిన పనులన్ని చేస్తోంది ఈ జంట.

ఇదొక సర్ప్రైజ్ అయితే, మరో వింత ఏమిటంటే, ఈ హీరోయిన్ ఏమి సింగల్ కాదు. ఆమెకి ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. భార్య కళ్ళుగప్పి హీరో, బాయ్ ఫ్రెండ్ కి తెలీకుండా హీరోయిన్ చెట్టాపట్టాలేసుకోని తిరుగుతున్నారు‌. ఈ హీరోయిన్ కి అంటే బాలివుడ్ అవకాశాలు కావాలి, అందుకోసం ఆ హీరోతో ఎఫైర్ కావాలి. మరి అందమైన భార్యను ఇంట్లో పెట్టుకోని, బాలివుడ్ లో పేరుతో పాటు మార్కేట్ పెట్టుకోని, చెడ్డపేరు తీసుకొచ్చే పనులు ఎందుకు చేస్తున్నారో ఆ హీరోగారు.