తన భర్తపై అలాంటి కామెంట్ చేసిన నెటిజన్... దాంతో సునీత ఏకంగా...

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలు అందరికీ అందుబాటులోకి రావడంతో సినీ సెలబ్రిటీలు వీటి ద్వారా సామాన్య ప్రజలకు బాగానే అందుబాటులో ఉంటున్నారు.ఈ క్రమంలో అప్పుడప్పుడు తమకు సంబంధించిన ఫోటోలు మరియు ఇతర సమాచారాలను కూడా తన అభిమానులతో పంచుకుంటున్నారు.

 Telugu Singer Sunitha Fires On Netizen, Telugu Singer, Sunitha, Netizen Abuse Co-TeluguStop.com

దీంతో కొందరు ఆకతాయిలు సినీ సెలబ్రిటీలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, అసభ్యకర వ్యాఖ్యలు చేయడం వంటివి చేస్తూ సెలబ్రిటీలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.కాగా తాజాగా తెలుగు చిత్రాలలో కొన్ని వందల కి పైగా పాటలను పాడి తన మధురమైన గానంతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ “సింగర్ సునీత” సోషల్ మీడియాలో చేదు అనుభవాన్ని ఎదుర్కొంది.

పూర్తి వివరాల్లోకి వెళితే గత కొద్దికాలంగా సింగర్ సునీత సోషల్ మీడియా మాధ్యమాలలో యాక్టివ్ గా ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే.కాగా తాజాగా సునీత తన అధికారిక ఫేస్ బుక్ ఖాతా ద్వారా తన భర్త రామ్ వీరపనేనితో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసింది.

దీంతో అతి కొద్ది సమయంలోనే ఈ ఫోటోకి లక్షల సంఖ్యలో లైకులు, కామెంట్లు వచ్చాయి.కానీ ఓ నెటిజన్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఈ ఫోటో పై స్పందిస్తూ “గ్రాండ్ ఫాదర్ అండ్ ఆంటీ” అంటూ వ్యంగంగా కామెంట్ చేశాడు.

దీంతో సునీత తనదైన శైలిలో స్పందిస్తూ ఆ నెటిజన్ పేరుని ప్రస్తావిస్తూ “గాడ్ బ్లెస్ యు నాన్న… బుర్ర మాత్రమే కాదు మనిషిగా కూడా నువ్వు చాలా ఎదగాలంటూ” రిప్లై ఇచ్చింది.దీంతో ఆ నెటిజన్ ఒక్కసారిగా అవాక్కయ్యాడు.

దీంతో ఈ మధ్య ఆకతాయిలు సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ పాపులర్ కావాలని చూస్తున్నారని ఇలాంటి వారికి సింగర్ సునీత సరిగ్గా బుద్ధి చెప్పిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Telugu Face, Netizen Abuse, Ramakrishna, Sunitha, Elugu, Telugusunitha, Tollywoo

అయితే ఈ విషయం ఇలా ఉండగా గత కొద్ది కాలంగా తన వైవాహిక జీవితంలో చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంది.దీంతో తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చి ఇటీవలే మ్యాంగో మ్యూజిక్ సంస్థల యజమాని రామ కృష్ణ వీరపనేని పెళ్లి చేసుకుంది.ప్రస్తుతం వీరిద్దరూ చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube