పాపం.... ఈ సీరియల్ హీరోయిన్ ని సందులోకి రమ్మని పిలిచి.... దారుణంగా....

తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి జీ తెలుగులో అప్పట్లో ప్రసారమయ్యే “ముద్ద మందారం” సీరియల్ ద్వారా తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న కన్నడ బ్యూటీ “తనూజ గౌడ” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ ధారావాహికలో తనుజ గౌడ హీరో ఇంట్లో పని చేసే అమ్మాయి పాత్రలో నటించి బాగానే అలరించింది.

 Telugu Serial Actress Thanuja Gowda Facing Abuse Moments On Road, Thanuja Gowda,-TeluguStop.com

 కాగా  తనూజ గౌడ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని తన సినీ జీవితంలో ఎదుర్కొన్న సంఘటనల గురించి ప్రేక్షకులతో పంచుకుంది.

అయితే ఇందులో అప్పట్లో ఒక ప్రముఖ టీవీ ఛానల్ నిర్వహించిన ఈవెంట్ లో పాల్గొన్న సమయంలో తాను బిచ్చగత్తె వేష ధారణలో రోడ్డు పైకి వచ్చానని దీంతో ఓ వ్యక్తి తనను చూసి అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపింది.

 అంతేకాక అక్కడ ఎవరూ లేకపోవడంతో తనని నిర్మానుష్య ప్రాంతంలోకి  లాక్కెళ్ళడానికి ప్రయత్నించాడని దాంతో అతడి నుంచి ఎలాగోలా తప్పించుకుని వచ్చేసానని తెలిపింది.ఒక సెలబ్రిటీ హోదా లో ఉన్నటువంటి తనపైన ఇంతటి అఘాయిత్యం జరిగిందంటే సామాన్య ప్రజలు మరియు నిలువ నీడ లేకుండా రోడ్లపైనే జీవితాలను గడిపేటువంటి వారి భద్రత గురిఞ్చి ఆలోచిస్తే చాలా భయమేస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది.

Telugu Muddamandaram, Serial Actress, Teluguserial, Thanuja Gowda, Thanujagowda,

అయితే ఈ  విషయం ఇలా ఉండగా తెలుగులో తనుజ గౌడ రెండు, మూడు చిత్రాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. కానీ ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో ఈ అమ్మడు హీరోయిన్ గా ఎవరు గుర్తించ లేదు. దీంతో తనూజ గౌడ చేసేదేమీ లేక సీరియళ్లలో హీరోయిన్ గా నటించడం ప్రారంభించింది. ఈ క్రమంలో ముద్ద మందారం సీరియల్ ఈ అమ్మడికి తెలుగులో మంచి పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెట్టింది.

 కాగా ఈ సీరియల్ ఇటీవలే సమాప్తం కావడంతో ప్రస్తుతం కన్నడలోని ఓ సీరియల్ లో నటిస్తోంది.కాగా తెలుగులో నాగ భైరవి అనే సీరియల్ లో  నటించడానికి ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube