ఈ సీరియల్ హీరోయిన్ ఆ హీరో తో ఎఫైర్ పెట్టుకుందంటూ తన అక్క దారుణంగా...

తెలుగులో ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయిన ఈ టీవీ లో ప్రసారమయ్యే “అభిషేకం” అనే ధారావాహిక ద్వారా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రముఖ సీరియల్ హీరోయిన్ సమీరా షరీఫా  గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే సమీరా నటిగానే కాకుండా కూడా జీ తెలుగు లో ప్రసారమయ్యే “అదిరింది షో” లో కొంతకాలం పాటు హోస్ట్ గా కూడా వ్యవహరించింది.

 Telugu Serial Actress Sameera Sherief About Her Love Affair With Serial Hero-TeluguStop.com

 కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఆమె ఈ షో నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.అయితే తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో సమీరా పాల్గొని సినీ పరిశ్రమలో తాను ఎదుర్కున్న ఒడిదుడుకుల గురించి పలు ఆసక్తికర విషయాలను  ప్రేక్షకులతో పంచుకుంది.

ఇందులో భాగంగా తాను సినిమా పరిశ్రమలో అక్కలా భావించేటువంటి ఓ నటి తన గురించి సినిమా పరిశ్రమలో తప్పుడు ప్రచారాలను చేసిందని వాపోయింది. అంతేకాక తనకి సినిమా పరిశ్రమలో హీరోగా రాణిస్తున్న ఓ ప్రముఖ నటుడుతో “లవ్ ఎఫైర్” ఉందని లేనిపోని వార్తలను ప్రచారం చేసిందని కానీ ఆ వార్తలలో ఎలాంటి వాస్తవం లేదని స్ఫష్టం చేసింది.

 Telugu Serial Actress Sameera Sherief About Her Love Affair With Serial Hero-ఈ సీరియల్ హీరోయిన్ ఆ హీరో తో ఎఫైర్ పెట్టుకుందంటూ తన అక్క దారుణంగా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే మొదట్లో ఈ తప్పుడు వార్తల గురించి తెలియదని కానీ తన గురించి అన్నీ తెలిసిన ఓ సీనియర్ నటి తప్పుడు ప్రహకారాలను చేస్తున్నట్లు తెలియడంతో ఎంతగానో బాధించిందని తెలిపింది.

Telugu Sameera Sherief, Sameera Sherief About Her Love Affair, Sameera Sherief Clarify About Her Love Affire False News, Telugu Serial Actress, Telugu Serial Actress Sameera Sherief About Her Love Affair With Serial Hero, Tollywood-Movie

ఇలా చేయడం వల్ల ఆమెకు ఏం లాభం ఉంటుందో తెలియదు కానీ తాను మాత్రం కొంత కాలం పాటు చాలా ఇబ్బందులు పడ్డానని కానీ తర్వాత మెల్ల మెల్లగా అలాంటి వాళ్ళతో స్నేహం చేయడం మానేశానని చెప్పుకొచ్చింది.అంతేగాక మరోమారు ఇలాంటి  తప్పుడు ప్రచారాలను తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నానని కూడా తెలిపింది.  అలాగే తాను గర్భవతి అని  వినిపిస్తున్న వార్తలు కూడా అవాస్తవమని స్పష్టం చేసింది.

అయితే ఈ విషయంలో ఇలా ఉండగా సమీరా షరీఫ్ తెలుగులో పలు ధారావాహికలలో హీరోయిన్ గా నటిస్తుండడమే కాకుండా మలయాళం, తమిళ భాషలకు చెందిన పలు ధారావాహికలకు సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది.అయితే ఈమె అత్త సన షరీఫ్ టాలీవుడ్ లో పలు చిత్రాలలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది.

 ఇక సమీరా షరీఫ్ భర్త షరీఫ్ సొంతంగా ప్రొడక్షన్ హౌస్ నిర్వహిస్తున్నాడు.అలాగే మలయాళ భాషలోని పలు ధారావాహికలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు.

#TeluguSerial #SameeraSherief #Sameera Sherief #TeluguSerial #SameeraSherief

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు