సినిమా సెట్లో కృతి ఏడ్చేసింది.. దాంతో అప్పుడే అనుకున్నా... 

తెలుగు బుల్లితెరలో పలు ధారావాహికలలో నెగటివ్ షేడ్స్ మరియు విలన్ ఓరియెంటెడ్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ సీరియల్ నటి “రితూ చౌదరి” గురించి బుల్లితెర ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు ఇటీవలే టాలీవుడ్ నూతన దర్శకుడు బుచ్చి బాబు దర్శకత్వం వహించిన ఉప్పెన చిత్రంలో హీరో మరదలి పాత్రలో నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

 Telugu Serial Actress Rithu Chowdary About Krithi Shetty Crying Scene In Uppena-TeluguStop.com

కాగా తాజాగా రితూ చౌదరి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని తన గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పెంచుతుంది.

అయితే ఇందులో భాగంగా ఉప్పెన చిత్రంలో హీరోగా నటించిన వైష్ణవ్ తేజ్ మరియు తాను కలిసి ఒకే కాలేజీలో చదువుకున్నామని తెలిపింది.

కానీ వైష్ణవ్ తేజ్ తనకంటే ఒక సంవత్సరం పెద్ద వాడని చెప్పుకొచ్చింది.కానీ తనకు మాత్రం వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమా సెట్లోనే పరిచయమయ్యాడని తెలిపింది.అలాగే తాను చదివిన కాలేజీలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు అతడి భార్య ప్రణీత, రానా దగ్గుబాటి, అక్కినేని నాగ చైతన్య, నిహారిక తదితరులు కూడా చదివారని తెలిపింది.ఒక రకంగా చెప్పాలంటే తాను అక్కినేని నాగ చైతన్య కోసమే ఆ కాలేజీలో చేరానని కానీ తను కాలేజీలో చేరినప్పటికే అక్కినేని నాగ చైతన్య చదువు పూర్తయి వెళ్లిపోయాడని తెలిపింది.

Telugu Krithi Shetty, Rithu Chowdary, Teluguserial, Tollywood, Uppena-Movie

ఇక ఉప్పెన చిత్రంలో నటిస్తున్న సమయంలో ఇతర నటీనటులతో తన అనుభవాల గురించి స్పందిస్తూ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన కృతి శెట్టి చాలా హార్డ్ వర్క్ చేస్తుందని, అలాగే నటన పట్ల కూడా ఎంతో అంకితభావంతో ఉంటుందని తెలిపింది.అలాగే జల జలపాతం పాట తరువాత వచ్చేటువంటి సన్నివేశాల్లో కృతి శెట్టి ఏడుస్తుందని అయితే ఆ సన్నివేశాలను తెరకెక్కిస్తున్న సమయంలో ఎలాంటి గ్లిజరిన్ లేకుండా కృతి శెట్టి సహజంగానే ఎడ్చేసిందని అంతగా నటనలో ప్రావీణ్యం పొందిందని తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube