హీరోయిన్ గా ఆఫర్ వస్తే కచ్చితంగా సినిమాల్లో నటిస్తా....

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మధ్యమాలు అందరికీ అందుబాటులోకి రావడంతో సెలబ్రిటీలు తమ అభిమానులతో బాగానే ముచ్చటిస్తున్నారు.ఈ క్రమంలో కొందరు పలు ఆసక్తికర విషయాలను మరియు తమ రాబోయే ప్రాజెక్టు అప్డేట్లను కూడా పంచుకుంటున్నారు.

 Telugu Serial Actress Meghana Lokesh About Heroine Chances In Tollywood-TeluguStop.com

కాగా తెలుగులో పలు ధారావాహికలలో హీరోయిన్ గా నటించి బుల్లితెర సినీ ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేసిన ప్రముఖ సీరియల్ హీరోయిన్ “మేఘన లోకేష్” తాజాగా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా లైవ్ కార్యక్రమం నిర్వహించి తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.

ఇందులో భాగంగా ఓ నెటిజన్ “మీకు సినిమాల్లో హీరోయిన్ గా అవకాశం వస్తే మళ్లీ నటిస్తున్నారా.? అని అడిగాడు. దీంతో మేఘన లోకేష్ ఈ విషయంపై స్పందిస్తూ ప్రస్తుతం తాను కేవలం సీరియల్ లో మాత్రమే హీరోయిన్ గా నటిస్తున్నానని ఎలాంటి చిత్రాల్లోనూ హీరోయిన్ గా నటించడం లేదని సమాధానం ఇచ్చింది.

 Telugu Serial Actress Meghana Lokesh About Heroine Chances In Tollywood-హీరోయిన్ గా ఆఫర్ వస్తే కచ్చితంగా సినిమాల్లో నటిస్తా….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

 అంతేగాక తనకి కూడా సినిమాల్లో హీరోయిన్ గా నటించాలని ఉందని అలాగే తన పాత్రకి ప్రాధాన్యత ఉన్నటువంటి అవకాశం వస్తే ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధమేనని తెలిపింది.అంతేగాక తన అభిమానుల కోరిక మేరకు ఈ రోజు సాయంత్రం 5.30 నిమిషాలకి యూట్యూబ్ ఛానల్ ని లాంచ్ చేస్తున్నానని కాబట్టి తనని నటిగా ఆదరించిన  బుల్లితెర ప్రేక్షకులకు తన యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేసింది.అలాగే  తనకి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక యూట్యూబ్ ఛానల్ లేదని కూడా స్పష్టం చేసింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మేఘన లోకేష్ తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయిన “జీ తెలుగులో” ప్రసారం అవుతున్న “కల్యాణ వైభోగం మరియు రక్త సంబంధం” అనే ధారావాహికలలో హీరోయిన్ గా నటిస్తోంది.అయితే గతంలో మేఘన లోకేష్ టాలీవుడ్ ప్రముఖ యాంకర్ రవి హీరోగా నటించిన “ఇది మా ప్రేమ కథ” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది.

 కానీ ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోక పోవడంతో ఈ అమ్మడికి హీరోయిన్ గా పెద్దగా గుర్తింపు రాలేదు.  అయితే మేఘన లోకేష్ పలు యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించింది.

ఇందులో ఎమోషన్ అనే షార్ట్ ఫిలిం ప్రేక్షకులని బాగానే అలరించింది.

#TeluguSerial #Heroine Chances #Meghana Lokesh #TeluguSerial

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు