అలాంటి సమస్యలుంటాయనే సినిమాల్లో హీరోయిన్ గా నటించలేదు...  

Telugu serial actress Lakshmi Vasudevan React about heroine chance, Telugu serial actress, Lakshmi Vasudevan, Chi La Sow Sravanthi, Casting couch, heroine chances, Tollywood - Telugu Casting Couch, Chi La Sow Sravanthi, Heroine Chances, Lakshmi Vasudevan, Telugu Serial Actress, Telugu Serial Actress Lakshmi Vasudevan React About Heroine Chance, Tollywood

తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయిన జెమినీ టీవీలో అప్పట్లో ప్రసారమయ్యే  “చి.ల.సౌ స్రవంతి” అనే ధారావాహిక బుల్లితెర ప్రేక్షకులు ఇప్పటికీ బాగానే గుర్తుంటుంది. ఈ ధారావాహికలో హీరో హీరోయిన్లుగా నటించిన నంద కిషోర్, మీనా కుమారి, లక్ష్మి, భరణి శంకర్ తదితర నటులు తమ నటనా ప్రతిభతో ప్రేక్షకులని కట్టి పడేసారు.

TeluguStop.com - Telugu Serial Actress Lakshmi Vasudevan React About Heroine Chance

అయితే తాజాగా ఈ ధారావాహికలో శరణ్య పాత్రలో నటించిన “లక్ష్మీ వాసుదేవన్” ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని తన బుల్లితెర ప్రయాణం గురించి పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.

ఇందులో భాగంగా తనకి సినిమాల్లో హీరోయిన్ గా నటించడం కంటే సీరియల్ లో విలన్ గా నటించడమే చాలా ఇష్టమని తెలిపింది.

TeluguStop.com - అలాంటి సమస్యలుంటాయనే సినిమాల్లో హీరోయిన్ గా నటించలేదు…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

 ఇందుకు ముఖ్య కారణంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సినిమాల్లో హీరోయిన్లకు పెద్దగా ప్రాధాన్యత లేదని, కానీ ధారావాహికలలో మాత్రం విలన్ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉండడంతో పాటు మరిన్ని డైలాగులు మరియు బిల్డప్ వంటివి కూడా ఉంటాయని అందుకే తనకి బుల్లితెరలో నటించడం అంటే చాలా ఇష్టమని పేర్కొంది.

ఇక అన్ని రంగాల్లో మాదిరిగానే క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు బుల్లితెర రంగంలో కూడా ఉన్నాయని కానీ వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళితేనే మనం సినిమా పరిశ్రమలో మనుగడ సాధించగలమని తెలిపింది.

అంతేగాక ఒక రకంగా చెప్పాలంటే క్యాస్టింగ్ కౌచ్ సమస్యల వల్లే తాను సినిమా పరిశ్రమకు దూరంగా ఉన్నానని కూడా పరోక్షంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.ఇక తన వ్యక్తిగత విషయాలపై స్పందిస్తూ తనకు సీరియళ్లలో నటించడం వల్ల  వచ్చేటువంటి ఆదాయం మాత్రమే  కాకుండా తనకు బెంగళూరు పరిసర ప్రాంతంలో లో కన్స్ట్రక్షన్ కి సంబంధించిన సొంత కంపెనీ మరియు మరిన్ని రిసార్టులు, హోటళ్ళు ఉన్నాయని తెలిపింది.

అయితే తెలుగులో తాను నటించిన అన్ని ధారావాహికలు దాదాపుగా ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్నాయని తెలిపింది.అంతేగాక తాను కేవలం విలన్ పాత్రల్లో అలా నెగటివ్ గా నటిస్తానని అంతే తప్ప నిజ జీవితంలో చాలా సున్నితంగా ఉంటానని చెప్పుకొచ్చింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం లక్ష్మీ వాసుదేవన్ ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి ఈ టీవీలో ప్రసారమవుతున్న ఓ దారవాహికలో నటిస్తోంది.అంతేగాక మంత్ర అనే ఓ బ్యూటీ స్టూడియో ని కూడా నడుపుతోంది.

#Heroine Chances #TeluguSerial #ChiLa #Casting Couch #TeluguSerial

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు