మా ఇంట్లో పెళ్లికి ఒప్పుకోలేదు.. అందుకే పెళ్లి చేసుకుని పోలీస్ స్టేషన్ కి ....

తెలుగులో పలు చిత్రాలు మరియు ధారావాహికల ద్వారా ఇటు బుల్లితెర ప్రేక్షకులను, అటు వెండితెర ప్రేక్షకులను బాగానే అలరించిన ప్రముఖ సీరియల్ నటి కరుణ భూషణ్ గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే నటి కరుణ సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో పలు చిత్రాలను హీరోయిన్ గా కూడా నటించింది.

 Telugu Serial Actress Karuna Bhushan About Her Marriage With Bharat Bhushan-TeluguStop.com

కానీ ఆ చిత్రాలు బాక్సాఫీసు వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఈ అమ్మడిని ఎవరూ గుర్తించలేదు.దీంతో అప్పుడప్పుడు కరుణ భూషణ్  యాంకరింగ్ కూడా నిర్వహించేది.

అయితే తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో కరుణ భూషణ్  పాల్గొని తన ప్రేమ మరియు పెళ్లి తదితర విషయాల గురించి పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకుంది.

అయితే ఇందులో భాగంగా తాను తన భర్త భరత్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, అలాగే తన భర్త యాడ్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడని చెప్పుకొచ్చింది.

అయితే అప్పట్లో తన భర్త భరత్ ఓ బంగారు నగల సంస్థను ప్రమోట్ చేసేందుకు నటీనటులను వెతుకుతుండగా అనుకోకుండా తనని కలిశానని అలా తమ ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని చెప్పుకొచ్చింది.

ఆ తర్వాత కొద్దికాలంలోనే ఈ పరిచయం కాస్త ప్రేమకు దారి తీసిందని కానీ తమ ఇంట్లో ప్రేమ పెళ్లికి ససేమిరా ఒప్పుకోలేదని దాంతో ఇద్దరూ కలిసి ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నామని తెలిపింది.

పెళ్లయిన తరువాత కూడా ఇరువురు కొంతకాలం పాటు తమ కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నామని ప్రస్తుతం అంతా సర్దుకుని తమ కుటుంబ సభ్యులతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నామని  తెలిపింది.అలాగే తనకు ప్రస్తుతం ఒక బాబు ఉన్నాడని అతడు యూకేజీ చదువుతున్నాడని తెలిపింది.

Telugu Add Maker, Bharat Bhushan, Karuna Bhushan, Karunabhushan, Teluguserial, T

ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో నటి కరుణ ప్రామిస్, భారత్ మహాన్, సక్సెస్ తదితర చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.కానీ ఈ చిత్రాలు బాక్సాఫిస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.దాంతో ఈ అమ్మడిని హీరోయిన్ గా ఎవరూ గుర్తించలేదు.ఆ తర్వాత శ్రావణ సమీరాలు, మొగలి రేకులు, అభిషేకం, యువ తదితర సీరియళ్ల ద్వారా బుల్లితెర ప్రేక్షకులను బాగా అలరించింది.

ప్రస్తుతం పలు రకాల షో లు ఈవెంట్లు మరియు సీరియల్ లో నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube