ఈ సీరియల్ నటి అలాంటి కేసులో ఇరుక్కోవడం వల్లే తన కెరియర్ నాశనం అయ్యిందట...

సినిమా పరిశ్రమలో ఎలాగైనా ఒక ఛాన్స్ దక్కించుకుని తమ నటనా ప్రతిభను నిరూపించుకుని స్టార్ గా ఎదగాలని ఎంతో మంది నటీనటులను కలలుకంటూ ఉంటారు. ఈ క్రమంలో కొందరు మొదటగా అవకాశాలు దక్కించుకుని ఎలాంటి కాంట్రవర్సీలకి  తావు లేకుండా దూసుకుపోతుంటే మరికొందరు మాత్రం వచ్చిన అవకాశాలను సరిగ్గా వినియోగించు కోకుండా సినీ కెరీర్ ని నాశనం చేసుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు.

 Telugu Serial Actress Dimple Collapse Her Cinema Career For Acid Attack Case Iss-TeluguStop.com

 అయితే ఇందులో తెలుగు బుల్లితెర నటి డింపుల్ ఒకరు.

అయితే డింపుల్ సినిమా పరిశ్రమకు వచ్చిన కొత్తలో అవకాశాల కోసం బాగానే కష్ట పడింది.

 ఈ క్రమంలో సినిమాల్లో ఛాన్సులు దక్కించుకోకపోయినప్పటికీ సీరియల్స్ లో నటించే అవకాశాలు దక్కించుకుంది.దీంతో ఎలాంటి అడ్డంకులు లేకుండా కెరీర్ సాఫీగా సాగిపోతున్న సమయంలో ఈమె చేసినటువంటి ఓ పని కారణంగా పలు అవకాశాలను కోల్పోయింది.

 అయితే ఇంతకీ ఆ పని ఏంటంటే అప్పట్లో నటి డింపుల్ పలు సీరియల్స్ లో హీరోగా నటిస్తున్న ఓ ప్రముఖ సీరియల్ నటుడిని ప్రేమించింది. కానీ ఒకానొక సమయంలో ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో అతడిపై యాసిడ్ దాడి చేయించింది.

కానీ ఈ యాసిడ్ దాడిని చేయించింది తానే అని తెలియకుండా మరో నటుడిపై నేరం మోపింది.

దీంతో నటి డింపుల్ నేరం మోపినటువంటి ఆ నటుడు అప్పటికే సినిమా పరిశ్రమలో బాగానే రాణిస్తున్నాడు.

 దీంతో తన పలుకుబడిని ఉపయోగించి నిజానిజాలను తెలుసుకున్నాడు. అనంతరం ఆమె పై ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం నటి డింపుల్ కి ఎలాంటి అవకాశాలు లేవు.

దీంతో కొందరు నెటిజన్లు నటి డింపుల్ అవగాహన లేకుండా చేసిన పని కారణంగా తన చేజేతులారా తన సినీ కెరీర్ ని నాశనం చేసుకుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube