చిరిగిపోయిన ప్యాంట్ వేసుకుందంటూ సీరియల్ హీరోయిన్ ని...

Telugu Serial Actress Deepika Singh Trolled For Torn Jeans Wearing

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో సినీ సెలబ్రిటీల గురించి ఏదైనా ఓ వార్త షేర్ చేస్తే చాలు ఇట్టే వైరల్ అవుతోంది.దీనికి తోడు ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ ఉండటం మరియు సినీ సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తన అభిమానులకు అందుబాటులో ఉంటూ అప్పుడప్పుడు ఫోటోలు వీడియోలు షేర్ చేయడం వంటివి చేస్తుండడంతో ఏ విషయమైనా సరే ప్రేక్షకులకి చాలా తొందరగా తెలిసిపోతోంది.

 Telugu Serial Actress Deepika Singh Trolled For Torn Jeans Wearing-TeluguStop.com

ఈ క్రమంలో కొందరు ఆకతాయిలు నెటిజన్ల ఫోటోలు మరియు వీడియోలపై ట్రోల్స్ చేస్తుంటారు.అయితే తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి మా టీవీలో ప్రసారమయ్యే ఈతరం ఇల్లాలు (హిందీ అనువాద సీరియల్) అనే ధారావాహిక తో టాలీవుడ్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన హిందీ ప్రముఖ సీరియల్ హీరోయిన్ దీపికా సింగ్ గోయల్ సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది.

పూర్తి వివరాల్లోకి వెళితే ఈ మధ్య కాలంలో నటి దీపికా సింగ్ ఇంస్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి వాటిలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు అందుబాటులో ఉంటోంది.ఈ క్రమంలో అప్పుడప్పుడు తనకు సంబంధించిన అందమైన ఫోటోలు మరియు వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది.

 Telugu Serial Actress Deepika Singh Trolled For Torn Jeans Wearing-చిరిగిపోయిన ప్యాంట్ వేసుకుందంటూ సీరియల్ హీరోయిన్ ని…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే తాజాగా దీపికా సింగ్ తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసినటువంటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఇంతకీ ఆ ఫోటో లో ఏముందంటే నటి దీపికా సింగ్ నీలిం రంగు టీ షర్ట్ తో పాటు జీన్స్ ప్యాంట్ ధరించింది.

అంతేగాక ఈ ఫోటో కి సూర్యుడు ఉదయించాడు, ఆకాశం నీలం, ఇది అందంగా ఉంది మరియు మీరు కూడా ఉన్నారంటూ క్యాప్షన్ కూడా పెట్టింది.

అయితే ఈ అమ్మడు దరించిన ప్యాంటు టోర్న్ జీన్స్ కావడంతో తొడ శరీర భాగాలు కనిపిస్తున్నాయి.దీంతో అప్పటివరకు నటి దీపికా సింగ్ ని చీర మరియు సాంప్రదాయ దుస్తులలో చూసినటువంటి కొందరు నెటిజన్లు జీర్ణించుకోలేకపోతున్నారు.అంతేకాకుండా టోర్నీ జీన్స్ గురించి తెలియని వాళ్ళు ఏకంగా దీపికా సింగ్ చిరిగిపోయిన ప్యాంటు దుస్తులు ధరించినదంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.

మరికొందరైతే ఈ మధ్యకాలంలో దీపికా సింగ్ సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాల కోసం ప్రయత్నిస్తోందని అందువల్లనే ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ కుర్రకారు మతి పోగొడుతోందంటూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే 2011వ సంవత్సరంలో ఓ ప్రముఖ హిందీ ఛానల్ లో ప్రసారమయ్యే “దియా ఔర్ బాతీ హమ్” అనే ధారావాహిక ద్వారా ఈ అమ్మడు తన కెరీర్ ని మొదలు పెట్టింది.ఈ సీరియల్ మంచి హిట్ అవడంతో వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ బాగానే రాణించింది.అలాగే పలు షోలు, ఈవెంట్లలో కూడా గెస్ట్ గా పాల్గొని బాగానే అలరించింది.

ప్రస్తుతం సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది.

#DeepikaSingh #DeepikaSingh #Dia Bathi #Torn Jeans #Maa

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube