తెలుగు సీరియల్ ఆర్టిస్ట్ ల రోజు సంపాదన తెలిస్తే షాక్ అవుతారు? వారి ఒక్కోరోజు సంపాదన తెలిస్తే ఇంతనా అనుకుంటారు..       2018-05-26   04:22:25  IST  Raghu V

మంగమ్మగారి మనుమరాలు ,అష్టాచెమ్మా, ముద్దమందారం, అమెరికా అమ్మాయి, కెరటాలు…ఏంటి ఈ లిస్టు అనుకుంటున్నారా.. మన తెలుగు సీరియల్స్.. ముఖ్యంగా తెలుగు మహిళలు తెలుగు సీరియల్స్ చూడటానికి అలవాటు పడ్డారు. ఇచ్చే సీరియల్ తక్కువ యాడ్స్ ఎక్కువ అయిన ఓపిక గా కూర్చొని నెక్ట్స్ ఏమవుతుందో అంటూ చూస్తుంటారు. ఇలా సీరియళ్లకు బానిసలుగా మారిన తెలుగు మహిళలు ఎందరో.. అందుకే టాప్ TRP లు వస్తున్నాయి. సీరియళ్ల పుణ్యాన తెలుగులో చాలా టెలివిషన్ చానెల్స్ డబ్బులు వెనకేసుకుంటున్నాయ్. ఏళ్లకేళ్లు గా సాగే సీరియళ్లలో నటించే వారిని చూసినప్పుడల్లా వీళ్లు ఏళ్ల తరబడి చేస్తూనే ఉంటారు వీళ్ల జీతాలెంతుంటాయో అనుకుంటాం కదా… వాళ్ళకి రోజు వారిగా చెల్లిస్తారా? లేక నెలకి ఒక్కసారి జీతంగా ఇస్తారా ? అనే డౌట్ అందరికి ఉంటుంది.అయితే తెలుగు సీరియల్స్ లో నటించే ఆర్టిస్ట్ ల జీతాలు చూడండి…

1.పల్లవి

పసుపు కుంకుమ సీరియల్ తో క్రేజ్ సంపాదించుకున్న నటి పల్లవి.. చేసింది ఒక్క సీరియలే అయినా తన నటనాభినయం, హావభావాలు, అందచందాలతో అందరినీ కట్టిపడేసింది. పల్లవి నటనకు తను చేసే పాత్ర కి తెలుగు మహిళలు ఫిదా అయిపోయారు దీనితో ఆమెకి అవకాశాలు బానే వస్తున్నాయ్. ఇప్పుడు పల్లవి రూ.15వేలు ఒక్క రోజుకే రెమ్యునరేషన్ అందుకుంటోంది. ఈమె ఇలాగే కంటిన్యూ చేస్తే రాబోయే కాలం లో ఇంకా పెరిగే అవకాశం ఉంది..

2.సుహాసిని

సుహాసిని ముందుగా తెలుగు సినిమా కి హీరోయిన్ గా పరిచయమైంది. అక్కడ అనుకున్నంతగా అవకాశాలు రాకపోవడం తో , కారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడిపోయింది.తన అందం , నటన తో బుల్లితెర స్టార్ గా మారిపోయింది. ఇప్పుడు అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న బుల్లితెర నటి ఈమెనే.. ఈమె జీతం రోజుకు 25000.. అపరంజితో బుల్లితెర ప్రవేశం చేసిన సుహాసిని.. యువరాణి, అష్టాచెమ్మ, వంటి సీరియల్స్ చేసింది. ఇప్పుడు ఇద్దరమ్మాయిలు సీరియల్లో మంచి పెర్ఫార్మెన్స్ తో ఉంది.

3. జ్యోతి

మంగమ్మగారి మనుమరాలలో లక్ష్మిగా తన నటనతో అందరిని ఆకట్టుకుంటున్న నూతన నటి జ్యోతి. అంతేకాదు ఈటీవిలో ప్రసారమవుతున్న విధి సీక్వెల్, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టులో నెగటివ్ రోల్ లో ఆమెను తప్పి వేరే వాళ్ళని ఊహించుకోలేం అన్నట్టుగా చేస్తున్నారు ఆమె. జ్యోతి రోజువారి వేతనం 10000 తీసుకుంటున్నారు.

4.నవీన

చంద్రముఖి, మళ్లీశ్వరి, కలవారి కోడళ్లు సీరియల్స్ లో యాక్ట్ చేస్తున్న నవీన రోజు తీసుకునే పారితోషికం రోజుకు 10000.

5.శ్రీవాణి

చంద్రముఖి, మనసుమమత, కలవారి కోడలు సీరియల్స్ లో యాక్ట్ చేసిన శ్రీవాణి , రోజుకి 10000 తీసుకుంటుంది. రాములమ్మ సీరియల్ లో నెగిటివ్ రోల్ లో అందరినీ ఆకట్టుకుంది శ్రీవాణి. ఆమెకు మరిన్ని నెగిటివ్ రోల్స్ రెడీగా ఉన్నాయట.ఇక ముందు ఇంకా ఎక్కువ పారితోషికం తీసుకునే అవకాశం ఉంది.

6. హరితేజ

అ.ఆ సినిమాలో సమంతతో కలిసి చేసిన పనమ్మాయి గుర్తుందా..? ఆమెనే హరితేజ.. బిగ్ బాస్ లో పాల్గొన్నాక ఈమెకి అవకాశాలు బాగానే వస్తున్నాయి, ఈమె డేట్స్ కోసం బుల్లితెర నిర్మాతలు క్యూ లు కడుతున్నారు. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ సినిమా అవకాశాలు వెతుక్కుంటూనే సీరియల్స్ కూడా చేస్తోంది. మనసు మమత సీరియల్ తో పాటు మంచు లక్ష్మి జెమినీలో స్పేస్ కొనుక్కుని మరీ చేస్తున్న ‘ఫిదా’ షో లోనూ సెలబ్రిటీలను ఇంటర్వ్యూలను చేస్తూ బిజీగానే ఉంది. బిగ్ బాస్ కు ముందు అయితే ఈమె రోజువారి వేతనం 10000.. ఇప్పుడు అది పెరిగే ఉంటుంది.

6. సుజిత

పరిచయమే అక్కర్లేని బుల్లితెర నటీమణి సుజిత , ఈమె చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు.. తర్వాత తెలుగు, తమిళ సీరియల్స్ లో యాక్ట్ చేస్తూ చాలా బిజీ అయిపోయింది. కలిసుందాం రా, కలవారి కోడలు, గంగోత్రి ఇలా ఎన్నో తెలుగు సీరియల్లో యాక్ట్ చేసిన ఈమె ప్రస్తుతం ఆడవారి మాటలకు అర్దాలే వేరులే సీరియల్లో యాక్ట్ చేస్తున్నారు .ఈమె తీసుకున్న రోజు వారి పారితోషికం 15000.. ఇంకో విశేషం ఏమిటంటే హీరోయిన్ కళ్యాణి భర్త డైరెక్టర్ సూర్యకిరణ్ కి స్వయంగా చెల్లెలే ఈ సుజిత.

7.మెరినా

అచ్చం అమెరికా అమ్మాయిగా చేస్తూ తెలుగువారి చూపును తనవైపు తిప్పుకున్న నటి మెరీనా.. మాటీవీలో ప్రసారమవుతున్న ఫేమస్ సీరియల్ ఉయ్యాల జంపాల సీరియల్లో కూడా హీరియిన్ గా నటిస్తోంది. ఈమె రోజు తీసుకునే వేతనం దాదాపు 6000.

8. అంజు

అంజు అస్రానీ నార్త్ ఇండియన్. అయినప్పటికీ తన మాతృభాష సిందీతో పాటు తెలుగు కూడా చక్కగా మాట్లడుతుంది. ఇప్పటివరకు 35 సీరియల్స్ లో నటించిన అంజు ప్రస్తుతం జెమినీలో అగ్నిపూలు సీరియల్లో లీడ్ రోల్ చేస్తోంది. అంజూ ఒక్క రోజుకి తీసుకునే పారితోషికం 7500రూ..