పాపం.. ఈ సీరియల్ హీరోయిన్ నల్లగా ఉందంటూ దారుణంగా అవమానించారట... దాంతో...

తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్మెంట్ ఛానెల్ అయిన జీ తెలుగులో అప్పట్లో ప్రసారమయ్యే “వరూధిణి పరిణయం” సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సీరియల్ లో వరూధిణి పాత్రలో నటించిన సీరియల్ హీరోయిన్ “చందన శెట్టి” ప్రేక్షకులని బాగానే అలరించింది.

 Telugu Serial Actress Chandana Shetty Facing Insults In Shooting Sets, Chandana-TeluguStop.com

 కాగా తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో చందన శెట్టి పాల్గొని తాను సీరియల్ షూటింగ్ లో పాల్గొన్నప్పుడు జరిగినటువంటి కొన్ని సంఘటనలను గురించి ప్రేక్షకులతో పంచుకుంది.

ఇందులో భాగంగా తాను కాలేజీలో చదువుకునే రోజుల్లోనే వరూధిణి పరిణయం ధారావాహికలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నానని దీంతో తన చదువులను సగంలోనే ఆపేసి నటనపై దృష్టి సారించానని చెప్పుకొచ్చింది.

అయితే తాను వరూధిని పరిణయం సీరియల్ షూటింగ్ లో పాల్గొన్న సమయంలో కొంతమేర నలుపు రంగులో ఉండటంతో కొందరు తన రంగుని చూసి అవహేళన చేయడం, పరోక్షంగా అవమానించడం వంటివి చేసేవారని దాంతో సినిమా పరిశ్రమని వదిలిపెట్టి మళ్లీ చదువుపై దృష్టి సారించాలని అనుకున్నానని తెలిపింది.

Telugu Chandana Shetty, Chandanashetty, Teluguserial, Zee Telugu-Movie

కానీ మెల్లమెల్లగా ఇలాంటి వాటిని పట్టించుకోవడం మానేసానని దాంతో ప్రస్తుతం నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నానని చెప్పుకొచ్చింది.అంతేగాక ఒకప్పుడు తనని రంగు తక్కువని అవహేళన చేసినటువంటి వారి చేతనే ప్రశంశలు అందుకుంటున్నానని అందుకు చాలా గర్వంగా ఉందని ఎమోషనల్ అయ్యింది.అంతేగాక తనని తెలు బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారని అందుకు తెలుగు ప్రేక్షకులకి ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం చందన శెట్టి తమిళంలో “దేవయాని” అనే ధారావాహికలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది.అలాగే తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్మెంట్ ఛానెల్ అయిన “మా” టీవీలో ప్రసారమయ్యే “పవిత్ర బంధం” అనే చిత్రంలో కూడా నటిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube