అందుకే కమల్ హాసన్ నన్ను కొట్టాడు... కానీ...

తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయిన జీ తెలుగులో ప్రసారం అవుతున్న “కల్యాణ వైభోగం” అనే ధారావాహికలో ప్రధాన పాత్రలో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో  ఆకట్టుకుంటున్న సీరియల్ “నటి భావన” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే నటి భావన మొదట్లో పలు చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా నటించింది.

 Telugu Serial Actress Bhavana About Her Remuneration And Clash With Kamal Hassan-TeluguStop.com

అంతేగాక దాదాపుగా 40కి పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో కనిపించింది. అయితే తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో నటి భావన పాల్గొని పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.

ఇందులో భాగంగా సీరియల్ నటీనటులు రోజుకి వేల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటారనే మాట వాస్తవమేనని తెలిపింది.కానీ అందరూ తాము వేల రూపాయలు సంపాదిస్తున్న విషయాన్ని మాత్రమే చూస్తారని, కానీ ఇందులోనే తమ రోజువారీ ఖర్చులు మరియు తమ అసిస్టెంట్ లకు కూడా తామే జీతాలు ఇవ్వాల్సి ఉంటుందని ఇవన్నీ ఎవరికీ కనపడని కేవలం తాము రోజుకి 10 వేల రూపాయలు లేదా 20 రూపాయలు తీసుకునే రెమ్యూనరేషన్ చూస్తారని అభిప్రాయం వ్యక్తం చేసింది.

అయితే  తనకి దాదాపుగా 7 సంవత్సరాలు వయసు వచ్చినప్పటి నుంచి సినిమాల్లో మరియు సీరియళ్ళలో  నటిస్తున్నానని ఇప్పటి వరకు దాదాపుగా సినిమాలు, సీరియళ్లు కలిపి 200కి పైగా నటించానని చెప్పుకొచ్చింది.అంతేకాక “రంగం” అనే డాన్స్ షో ద్వారా ఇతర దేశాలలో కూడా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చానని కూడా తెలిపింది.

అలాగే అమెరికాలోని తెలుగు వాళ్ళు సినీ సెలబ్రిటీలతో చాలా మర్యాద పూర్వకంగా ఉంటారని ఈ విషయం తనకు ఎంతగానో నచ్చిందని తెలిపింది.

అయితే చిన్నప్పుడు తాను బాలయ్య బాబు హీరోగా నటించిన “భారతంలో బాల చంద్రుడు” చిత్రంలో హీరో చెల్లెలి పాత్రలో నటించానని ఆ సమయంలో తన వయసు 9 ఏళ్లు ఉంటుందని తెలిపింది.

అయితే  ఈ చిత్ర షూటింగ్ జరుగుతున్న సమయంలో నందమూరి బాలకృష్ణ ఎంతో సరదాగా ఉండే వారని అంతేగాక తనికి రోజు చాక్లెట్లు, జేమ్స్ డబ్బా తీసుకొచ్చి ఇచ్చేవాడిని పాత రోజుల్ని గుర్తు చేస్తుంది.అయితే ఆ మధ్య కమల్ హాసన్ హీరోగా నటించిన మరో చిత్రంలో కూడా తను చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించానని ఆ సమయంలో ఓ సన్నివేశంలో నటిస్తున్నప్పుడు అనుకోకుండా ప్రముఖ హీరో కమల్ హాసన్ తన చెంప పై కొట్టాడని, కానీ ఆ తర్వాత తనని ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని సినిమా పరిశ్రమ గురించి మరియు అవకాశాల గురించి వివరిస్తూ ఓదార్చడని తెలిపింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నటి భావన తెలుగులో స్వాతి చినుకులు మరియు కళ్యాణ వైభోగం అనే ధారావాహికలలో నటిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube