తెలుగు సీరియల్ ఇండస్ట్రీ లో కన్నడ ఆర్టిస్టుల హవా ఉంటుంది... కానీ..

తెలుగులో రాణివాసం, మనసు మమత, లక్ష్మి కళ్యాణం, తదితర ధారావాహికలు ద్వారా బుల్లితెర ప్రేక్షకులను బాగానే అలరించిన ప్రముఖ సీరియల్ నటుడు ప్రియతమ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ప్రియతమ్ స్వతహాగా తెలుగు రాష్ట్రాలకు చెందిన నటుడు అయినప్పటికీ చాలా మంది అతడు పరభాషా నటుడనే సందేహం ఉంటుంది.

 Telugu Serial Actor Priyatam About Kannada Artist Offers In Telugu Industry,  Pr-TeluguStop.com

కాగా తాజాగా ప్రియతమ్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని తన సీరియల్ జీవిత ప్రస్థానం గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.

ఇందులో భాగంగా తాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ పరిసర ప్రాంతంలో పుట్టి పెరిగానని తెలిపాడు.

తన చదువు పూర్తయిన తరువాత నటనపై ఉన్నటువంటి ఆసక్తి కారణంగా సినిమా పరిశ్రమకు వచ్చానని, ఈ క్రమంలో అవకాశాల కోసం బాగానే ఇబ్బందులు ఎదుర్కొన్నానని కూడా తెలిపాడు.అయితే మొదట్లో పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించానని కానీ నటన పరంగా సరైన అనుభవం లేకపోవడం, పలు మెలుకువలు తెలియకపోవడంతో హీరోగా నటించే విషయంలో కొంత మేర ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చాడు.

దాంతో నటనపై మరింత దృష్టి సారించి ఇంట్లో నిత్య అద్దం ముందు సాధన చేసేవాడని చెప్పుకొచ్చాడు.ఇక తన వైవాహిక జీవితం గురించి స్పందిస్తూ తను షార్ట్ ఫిలిమ్స్ లో నటించే సమయంలో హీరోయిన్ కోసం వెతుకుతుండగా తన భార్య ప్రొఫైల్ కనబడిందని ఆ విధంగా తమ ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి చాలా తొందరగానే ఈ పరిచయం కాస్త పరిచయం పరిణయం వైపు దారి తీసిందని చెప్పుకొచ్చాడు.

ఇక తెలుగు సీరియల్ ఇండస్ట్రీ లో ఎక్కువగా పరభాషా నటుల హవా కొనసాగుతుందనే విషయంపై స్పందిస్తూ ప్రస్తుత ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే ఈ మాట వాస్తవమేనని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.అంతేకాకుండా ప్రముఖ తెలుగు టెలివిజన్ ఛానళ్లలో ప్రసారం అయ్యే సీరియళ్లలో ఎక్కువశాతం కన్నడ సినిమా పరిశ్రమకు చెందిన నటీనటులను ప్రోత్సహిస్తున్నారని > తెలిపాడు.

అయితే మన తెలుగు నటినటులు కూడా తమిళం, మలయాళం, కన్నడ, తదితర సినిమా పరిశ్రమలో నటీనటులుగా రాణిస్తున్నారని కానీ తెలుగు సీరియల్ పరిశ్రమలో తెలుగు వాళ్లకి సరైన గౌరవం మరియు అవకాశాలు దక్కడం లేదని చెప్పుకొచ్చాడు.

ఇక తాను ప్రస్తుతం ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే “లక్ష్మీ కళ్యాణం” ధారావాహికలో హీరో పాత్రలో నటిస్తున్నానని కూడా తెలిపాడు.

ఒకవేళ భవిష్యత్తులో తనకి విలన్ పాత్రలో నటించే అవకాశాలు వస్తే కచ్చితంగా నటిస్తానని కూడా తన మనసులో మాటను బయట పెట్టాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube