కరోనా సోకినా వారికి ఎలాంటి ఆహారాన్ని అందిస్తారో చెప్పిన నటుడు...

ప్రస్తుతం యావత్ దేశాన్ని కరోనా వైరస్ ఎంతగా కుదిపేస్తుందో ప్రతి ఒక్కరికి తెలుసు.అయితే కరోనా వైరస్ సోకిన వ్యక్తులకు క్వారంటైన్ లో ఎలా చూసుకుంటారు మరియు వారికి ప్రతిరోజు ఎలాంటి ఆహార పదార్థాలను అందిస్తారని విషయాలు ఇప్పటికీ చాలామందికి తెలియవు.

 Prabhakar, Telugu Serial Actor,   Corona Virus Patient Food, Daily Life, Quarant-TeluguStop.com

అయితే తాజాగా ఈ ఆహార నియమాలు మరియు తొందరగా కోలుకోవడానికి తీసుకునే జాగ్రత్తల విషయాలను గురించి టాలీవుడ్ సీరియల్ నటుడు ప్రభాకర్ ఓ వీడియో ద్వారా తెలిపాడు.

ఇందులో భాగంగా తాను ఇటీవలే కరోనా వైరస్ బారిన పడి తిరుపతిలో ఉన్నటువంటి పద్మావతి కరోనా క్వారెంటైన్ సెంటర్లో ఉన్నానని అయితే క్వారంటైన్ లో ఉదయం లేవగానే అందరికీ అల్లం టీ ఇచ్చేవారని అలాగే అల్పాహారంలో తేలికైన ఆహార పదార్థాల్ని ఇచ్చేవారని తెలిపాడు.

ఆ తరువాత మానసిక ప్రశాంతత కోసం యోగా మరియు వ్యాయామం వంటివి చేయించేవారని  ఆ తర్వాత వైద్యులు వచ్చి ఆరోగ్య పరిస్థితులను చెక్ చేసే వారిని, ఆ తర్వాత మళ్ళీ మంచి పోషకాలు కలిగినటువంటి ఆహారాన్ని ఇచ్చే వారని తెలిపాడు… ఇక సాయంత్రం సమయంలో కూడా ఇదేవిధంగా ఉంటూ దినచర్య ముగిసేదని తెలిపాడు.

దీంతో ఈ విషయాన్ని ప్రస్తుతం కొందరు నెటిజన్లు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ చేస్తున్నారు.

అంతేగాక కరోనా వైరస్ చికిత్సలను ఆరోగ్య శ్రీ పథకంలో చేర్చి మంచి నిర్ణయం తీసుకున్నటువంటి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి ని అభినందిస్తున్నారు.

ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా సేవలందిస్తున్న టువంటి వైద్యులు పారిశుద్ధ కార్మికులు మరియు పోలీసులు తదితరులకు ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube