పరిటాల రవి పేరుని ఈ ఇద్దరూ అలా వాడుకున్నారట.. చివరికి...

తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయిన ఈ టీవీ చానల్ లో అప్పట్లో ప్రసారమయ్యే “చంద్రముఖి” అనే ధారావాహిక ద్వారా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ సీరియల్ నటీనటులు నిరుపమ్ పరిటాల మరియు మంజుల పరిటాల గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ ఇద్దరూ చంద్రముఖి సీరియల్ లో నటిస్తున్నప్పుడే ప్రేమలో పడి ఇరువురి కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి కూడా చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే తాజాగా ఈ ఇద్దరూ ప్రతి మంగళవారం రాత్రి 9.30 నిమిషాలకు ఈ టీవీ ఛానల్ లో ప్రసారమయ్యే “ఆలీతో సరదాగా” షోలో పాల్గొన్నారు.దీంతో తాజాగా షో నిర్వాహకులు వచ్చే వారం ప్రసారమయ్యే ఎపిసోడ్ ప్రోమోని విడుదల చేశారు.

 Telugu Serial Actor Nirupam And Manjula About Using Paritala Name Experience-TeluguStop.com

అయితే ఇందులో భాగంగా నిరుపమ్ ఇంటిపేరు పరిటాల కావడంతో అతడికి చాలా మంచి జరిగిందని చెప్పుకొచ్చాడు.

గతంలో తాను మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన “ఇంద్ర” చిత్ర విడుదల రోజున ఫస్ట్ షో సినిమాకి వెళుతుండగా ఓ కానిస్టేబుల్ ఆపాడని దాంతో తాను పరిటాల రవి కుటుంబానికి చెందిన వాడినని చెప్పడంతో వెంటనే ఆ కానిస్టేబుల్ పంపించాడని, అంతేగాక సినిమా టికెట్లు కూడా తానే తెచ్చి ఇచ్చాడని చెప్పుకొచ్చాడు.అలాగే మంజుల పరిటాల కూడా డ్రైవింగ్ లైసెన్స్ విషయమై ఆర్టిఓ ఆఫీస్ కి వెళ్లగా తన ఇంటిపేరు పరిటాల కావడంతో వెంటనే డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చారని తెలిపింది.

 Telugu Serial Actor Nirupam And Manjula About Using Paritala Name Experience-పరిటాల రవి పేరుని ఈ ఇద్దరూ అలా వాడుకున్నారట.. చివరికి…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే తాను ఓ సీరియల్ లో నటిస్తున్నప్పుడు కొంతమంది తన పాత్రను చూసి అపార్థం చేసుకుని ఫోన్లు చేసి బెదిరించారని, అలాగే ఈమెయిల్స్ కూడా పంపించారని తెలిపాడు.దీంతో రోజూ చాలా ఫోన్ కాల్స్ వచ్చేవని, ఈ క్రమంలో ఓ సారి అనుకోకుండా హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఫోన్ ని కూడా కట్ చేశానని ఆ తర్వాత మళ్ళీ బ్రహ్మానందం కి ఫోన్ చేసి సారి చెప్పినట్లు చెప్పుకొచ్చాడు నిరుపమ్ పరిటాల.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఈ ఇద్దరు భార్యాభర్తలు తెలుగు, కన్నడ, తమిళం, తదితర భాషలలో నటిస్తూ బిజీ బిజీ షెడ్యూల్ తో గడుపుతున్నారు.కాగా ప్రస్తుతం నిరుపమ్ పరిటాల తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయిన మా టీవీలో ప్రసారమయ్యే “కార్తీక దీపం” సీరియల్ లో హీరోగా నటిస్తున్నాడు.

దీంతో అందరికీ నిరుపమ్ పరిటాలగా  కంటే డాక్టర్ బాబు గానే బాగా గుర్తుంటాడు.ఇక మంజుల పరిటాల కూడా తమిళం, తెలుగులోని పలు ధారావాహికలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటిస్తోంది.

#TeluguSerial #Serial Actors #Paritala Ravi #ManjulaParitala

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు