అలాంటి వాళ్ళే నా దృష్టిలో గొప్ప దర్శకులంటున్న సీనియర్ హీరో...

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోల చిత్రాలకి తన చిత్రాలతో బాగానే పోటీ ఇచ్చినటువంటి ప్రముఖ విలక్షణ నటుడు సుమన్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే అప్పట్లో సుమన్ హీరోగా బాగానే రాణిస్తున్న సమయంలో అనుకోకుండా ఓ కేసు వివాదంలో ఇరుక్కొని కొంతకాలం పాటు సినిమా పరిశ్రమకు దూరంగా ఉన్నాడు.

 Telugu Senior Hero Suman Sensational About Talented Directors, Suman, Telugu Se-TeluguStop.com

అయితే ఈ మధ్య కేసు వివాదాలు సర్దుమనుగడంతో వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు. కాగా తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో నటుడు సుమన్ పాల్గొన్నాడు.

అయితే ఇందులో సినీ పరిశ్రమలోని దర్శక నిర్మాతలపై పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇందులో ముఖ్యంగా ఎవరైతే నూతన ఆర్టిస్టులతో సినిమాలు చేసి తమ మొదటి చిత్రంతో హిట్ కొడతారో అలాంటి వాళ్లే నా దృష్టిలో గొప్ప దర్శకులని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

 అంతేగాక స్టార్ హీరోలు లేదా స్టార్ హీరోయిన్లతో సినిమాలు తీసి ఎవరైనా హిట్ కొడతారని కానీ నూతన నటీనటులతో సినిమాలు తీసి వారి ప్రతిభను చక్కగా వినియోగించుకుని హిట్ కొట్టే వారికి ఖచ్చితంగా సినిమా పరిశ్రమలో మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పుకొచ్చాడు.అలాగే గొప్ప సినీ దర్శకులకు పెద్ద సినీ దర్శకులకు చాలా తేడా ఉంటుందని భారీ బడ్జెట్ చిత్రాలు తీసిన మాత్రాన గొప్ప వాళ్ళు అయిపోయారని కూడా స్పష్టం చేశాడు.

అయితే ఇక సినిమా పరిశ్రమలో నెపోటిజం విషయంపై స్పందిస్తూ నటన పరంగా టాలెంట్ ఉన్నటువంటి వారికి సినిమా పరిశ్రమలో కచ్చితంగా అవకాశాలు ఉంటాయని అంతే తప్ప ప్రతిభ లేనివారు ఎక్కడా కూడా రాణించాలని చెప్పుకొచ్చాడు.ఇక తాను అప్పట్లో ఇరుక్కున్నటువంటి ఓ వివాదం గురించి కూడా స్పందిస్తూ కొంతమంది ఉద్దేశ పూర్వకంగానే తన తప్పు లేకున్నప్పటికీ కేసులో ఇరికించారని, దాంతో ఆ విషయాన్ని కొంతమంది అలుసుగా తీసుకొని తన గురించి తప్పుడు ప్రచారాలు చేశారని కానీ తాను నిర్దోషనని తెలిపాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube