కుర్ర హీరోయిన్ పై మనసు పారేసుకున్న సీనియర్ డైరెక్టర్     2017-01-01   21:03:16  IST  Raghu V

ఆయనొక సీనియర్ డైరెక్టర్. చాలా అంటే చాలా సీనియర్. అగ్రహీరోలని డైరెక్ట్ చేశాడు. వారితో హిట్లు కొట్టాడు, ఫ్లాప్స్ కూడా పడ్డాయి. అయితే, జయాపజయాలతో తేడా లేకుండా, ఆయనకంటూ ఓ బ్రాండ్ ఉంది తెలుగు సినిమా ప్రపంచంలో. ప్రస్తుతం పునర్వైభవం వెతుక్కునే పనిలో భారి బడ్జెట్ తో ఓ సినిమా చేస్తున్నాడు.

అందులో చాలా తక్కువ అనుభవం ఉన్నా, సక్సెస్ ఉన్న ఒక యంగ్ హీరోయిన్ నటిస్తోంది. తెలుగింటి అందంలా కనిపించే ఆ అమ్మాయి ఇప్పుడిప్పుడే క్రేజీ ఆఫర్లు దక్కించుకుంటోంది. ఇటివలె ఒక అగ్రహీరో సరసన జోడి కట్టింది కూడా.

ఆ అందమైన హీరోయిన్ పై మన సీనియర్ డైరెక్టర్ మనసు పారేసుకున్నాడట. తనకంటే సీనియర్ హీరోయిన్లను పట్టించుకోకుండా, ఈ హీరోయిన్ వెనకే ఎందుకు పడుతున్నాడో అంటూ ఫిలింనగర్ ప్రజానీకం గాసిప్పులు పెడుతున్నారు.

మొన్న, ఒక సీనియర్ నటుడు ఇచ్చిన న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ పార్టీలో, ఆ హీరోయిన్ పట్ల మన దర్శకుడికి ఉన్న ఫిలింగ్స్ స్పష్టంగా కనిపించాయి అని సమాచారం. మరి ఆ హీరోయిన్ కి ఈ విషయం తెలుసో, తెలిసినా, ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలనే భయంతో ఏం అనట్లేదో, అలా కాకుండా, తనకి కూడా సమ్మతంగానే ఉందో, ఈ విషయాలు మాత్రం తెలీదు.