ఒకప్పటి ఈ స్టార్ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా..?

తెలుగులో ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన  “గంగోత్రి” చిత్రంలో హీరో అల్లు అర్జున్ తల్లి పాత్రలో నటించి ప్రేక్షకులని బాగానే అలరించిన సీనియర్  హీరోయిన్ మరియు నటిసీత గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

 Telugu Senior Actress Sita Real Life News,  Sita, telugu Senior Actress, Veter-TeluguStop.com

 అయితే ఈమె అప్పట్లో హీరోయిన్ గా దాదాపుగా అందరి సీనియర్ హీరోల సరసన నటించగా ప్రస్తుతం వయసు మీద పడటం తో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకే పరిమితమైంది.అయితే తెలుగులో 1986 సంవత్సరంలో “ఆడదే ఆధారం” అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకి సీత హీరోయిన్ గా పరిచయం అయింది.

దాంతో తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, తదితర భాషలలో నటించే అవకాశాలను దక్కించుకుంది. ఈ క్రమంలో మొదట్లో సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో కొంతకాలం తర్వాత పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు.

దాంతో సీత సాఫ్ట్ వేర్ రంగంలో కీలక బాధ్యతలు చేపట్టిన మరో వ్యక్తిని మళ్లీ పెళ్లి చేసుకుంది.ఇటీవలే తన పెద్ద కూతురు పెళ్ళిని కూడా ఘనంగా చేసింది.

అయితే ఒకప్పుడు తన సినిమాలతో హీరోయిన్ గా బాగానే ఆకట్టుకున్న సీత ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక ఇంటి పట్టునే ఖాళీగా ఉంటోంది.అయితే చివరిగా తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన  “రభస” అనే చిత్రంలో హీరోయిన్ తల్లి పాత్రలో నటించింది.

ప్రస్తుతం నటి సీత తన కుటుంబ సభ్యులతో కలిసి కర్నాటకలోని బెంగళూరులో ఉన్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube