ఈ సీనియర్ నటుడి కొడుకు అక్కడ స్టార్ హీరో అని మీకు తెలుసా..?

తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన “స్నేహం కోసం” చిత్రంలో చిరంజీవి స్నేహితుడు పాత్రలో నటించి సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు “విజయ్ కుమార్” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే విజయ్ కుమార్ ఒకప్పుడు హీరో పాత్రలలో బాగానే అలరిస్తున్న సమయంలో తమిళంలో ఎక్కువ సినిమా అవకాశాలు రావడంతో తెలుగుపై పెద్దగా దృష్టి సారించ లేకపోయాడు.

 Telugu Senior Actor Vijayakumar Son Arun Vijay Kumar News, Telugu Senior Actor,-TeluguStop.com

అయినప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్నాడు.

కాగా విజయ్ కుమార్ కొడుకు అరుణ్ విజయ్ కుమార్ కూడా తమిళంలో హీరోగా బాగానే రాణిస్తున్నాడు.

 Telugu Senior Actor Vijayakumar Son Arun Vijay Kumar News, Telugu Senior Actor,-TeluguStop.com

అయితే అరుణ్ విజయ్ కుమార్ విజయ్ కుమార్ మరియు అతడి మొదటి భార్య ముత్తుకన్ను లకు జన్మించాడు.అయితే పెళ్లయిన తర్వాత విజయ్ కుమార్ ప్రముఖ తెలుగు సీనియర్ నటి మంజుల ని ప్రేమించి మళ్లీ పెళ్లి చేసుకున్నాడు.

వీరికి ముగ్గురు కూతుళ్లు.ఇందులో డాక్టర్ అనిత విజయ్ కుమార్,  వనిత విజయ్ కుమార్, శ్రీదేవి విజయ్ కుమార్, ప్రీతి విజయ్ కుమార్.

కాగా ఈ ముగ్గురు కూడా తెలుగులో హీరోయిన్లుగా నటించారు. కానీ పలు అనివార్య కారణాల వల్ల పెద్దగా సినిమా పరిశ్రమలో రాణించలేకపోయారు.

కాగా ప్రస్తుతం ఈ ముగ్గురు పెళ్లిళ్లు చేసుకుని బాగానే సెటిల్ అయ్యారు.ఇక అరుణ్ విజయ్ కుమార్ విషయానికొస్తే ఇతడు తెలుగులో రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన “బ్రూస్ లీ” చిత్రంలో విలన్ పాత్రలో నటించే ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్నాడు.

Telugu Kollywood, Manjula, Preethivijay, Sridevi, Telugu Senior, Telugusenior, V

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అరుణ్ విజయ్ కుమార్ తమిళంలో వరుస చిత్రాలలో నటిస్తూ దూసుకుపోతున్నాడు.ఈ క్రమంలో తమిళ ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న “బాక్సర్” అనే  చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తున్నాడు.ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన షూటింగ్ పనులు చెన్నై పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం. అంతేగాక ఇటీవలే “సీనం” అనే చిత్రంలో హీరోగా నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube