మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ నన్ను రాళ్లతో కొట్టడానికి ప్రయత్నించారు...

తెలుగులో ముఖ సీనియర్ దర్శకుడు విజయ భూపినాయుడు దర్శకత్వం వహించిన “గ్యాంగ్ లీడర్” చిత్రం సినీ ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తుంటుంది.కాగా ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ మెగాస్టార్ “చిరంజీవి” నటించగా హీరోయిన్ గా లేడీ సూపర్ స్టార్ “విజయశాంతి” నటించింది.

 Telugu Senior Actor Vallabhaneni Janardhan Sensational Comments On Chiranjeevi Fans-TeluguStop.com

అలాగే ఈ చిత్రంలో మురళీమోహన్, కైకాల సత్యనారాయణ, వల్లభనేని జనార్ధన్, సుధా, సుకన్య, శరత్ కుమార్, నూతన్ ప్రసాద్, అల్లూరి రామలింగయ్య తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.

అయితే ఈ చిత్రంలో ఎస్పి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి తన విలనిజంతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్న టాలీవుడ్ ప్రముఖ నటుడు వల్లభనేని జనార్ధన్ తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే.

 Telugu Senior Actor Vallabhaneni Janardhan Sensational Comments On Chiranjeevi Fans-మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ నన్ను రాళ్లతో కొట్టడానికి ప్రయత్నించారు…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా తాజాగా వల్లభనేని జనార్ధన్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని తన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.

ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు పరిసర ప్రాంతంలో తమకు ఇప్పటికీ వందల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని తెలిపాడు.

అయితే తాను సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో అవకాశాల కోసం ఎవరి దగ్గర చెయ్యి చాపలేదని అందువల్లనే తాను పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయినని తెలిపింది.అయితే తాను గ్యాంగ్ లీడర్ చిత్రంలో కూల్ విలన్ పాత్రలో కనిపించానని ఆ చిత్రం ద్వారా తనకి నటుడిగా మంచి గుర్తింపు లభించిందని కూడా చెప్పుకొచ్చాడు.

Telugu Chiranjeevi Fans, Gang Leader Movie, Telugu Senior Actor, Telugu Senior Actor Vallabhaneni Janardhan Sensational Comments On Chiranjeevi Fans, Vallabhaneni Janardhan-Movie

అయితే అప్పట్లో తాను చెన్నై లో ఉన్నటువంటి తన సొంత నివాసంలో ఉండేవాడినని దాంతో తన ఇంటి పక్కనే ఓ ఆటో డ్రైవర్ మెగాస్టార్ చిరంజీవి కి వీరాభిమాని కావడంతో గ్యాంగ్ లీడర్ చిత్రంలో తన నటనను చూసి తనని రాయితో కొట్టాలనుకున్నట్లూ తనతో చెప్పాడట.కానీ తన గురించి అసలు నిజం తెలియడంతో ఒక్కసారిగా అవాక్కయ్యాడని కూడా చెప్పుకొచ్చాడు.

అయితే నటుడు వల్లభనేని జనార్ధన్ ప్రస్తుతం వయసు మీద పడటంతో పెద్దగా సినిమాల్లో నటించడం లేదు.కాగా నటుడు వల్లభనేని జనార్ధన్ తెలుగు, తమిళం, తదితర భాషలలో కలిపి దాదాపుగా 100కు పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించాడు.

#TeluguSenior #TeluguSenior

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు