తెలుగులో కొన్ని వందలకు పైగా చిత్రాలలో విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన టాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు “తనికెళ్ల భరణి” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే నటుడు తనికెళ్ల భరణి కేవలం నటుడిగా మాత్రమే కాకుండా పలు చిత్రాలకు దర్శకత్వం వహించాడు.
అలాగే రైటర్ గా కూడా పని చేసాడు.దీంతో జాతీయ, రాష్ట్రీయ విభాగంలో దాదాపుగా 20 కి పైగా అవార్డులు కూడా అందుకున్నాడు.
కాగా నటుడు తనికెళ్ల భరణి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని సినిమాల ప్రభావం సమాజంపై ఏ విధంగా ఉందనే విషయంపై స్పందించాడు.
ఇందులో భాగంగా గతంలో తాను నటించిన మాతృదేవోభవ, ఆమె మరియు మరిన్ని చిత్రాలను చూసిన ప్రజలు తనని ఎంతగానో అసహ్యించుకున్నారని పలు మార్లు కొంతమంది తన మొహం మీదే ఎందుకు ఇలాంటి పాత్రల్లో నటించావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపాడు.
అంతేకాకుండా ఆమె చిత్రంలో తన పాత్రను చూసిన తర్వాత తన మరదలు కూడా తనతో మాట్లాడటానికి భయపడేదని కానీ ఆ తర్వాత తానే వివరించి మాట్లాడటంతో అప్పుడు నార్మల్ అయిందని చెప్పుకొచ్చాడు.అయితే ఇలాంటి పాత్రలు అంతగా పండటానికి కారణం దర్శకులే అని అలాగే ప్రేక్షకులు కూడా సినిమాల నుంచి మంచి, చెడులను నేర్చుకుంటారని తెలిపాడు.

అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వర రావు, తదితర స్టార్ హీరోలు సహాయం కోసం విరాళాలు అడగ్గా ఎంతోమంది లక్ష రూపాయలు ఇచ్చారని చెప్పుకొచ్చాడు.కానీ ఈ మధ్య కాలంలో సినిమాలోని మంచి కంటే చెడునే ప్రజలు ఆకర్షితులు అవుతున్నారని అందువల్ల ఎక్కువగా సినిమాల వల్ల జరిగే మంచి కంటే చెడు ప్రభావం ఎక్కువగా ఉంటుందనే విషయం ఫోకస్ అవుతుందని తెలిపాడు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం తనికెళ్ల భరణి తెలుగులో పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలో నటిస్తున్నాడు.అలాగే మరో రెండు చిత్రాలకు డైలాగ్ రైటర్ గా కూడా పని చేస్తున్నాడు.