పలు తెలుగులో చిత్రాలలో విలన్ మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలో నటించి బాగానే అలరించిన ప్రముఖ సీనియర్ నటుడు “రఘునాథ రెడ్డి” తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే.కాగా నటుడు రఘునాథ రెడ్డి 1995వ సంవత్సరంలో ప్రముఖ స్వర్గీయ దర్శకుడు మరియు నటుడు దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన “ఒరేయ్ రిక్షా” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి నటుడిగా పరిచయం అయ్యాడు.
ఆ తర్వాత దాదాపుగా 400కు పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించి బాగానే అలరించాడు.కాగా తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని సినీ జీవితంలో తనకు సన్నిహితులు మరియు చోటు చేసుకున్న కొన్ని సంఘటనల గురించి ప్రేక్షకులతో పంచుకున్నాడు.
ఇందులో భాగంగా పలు చిత్రాలలో విలన్ గా మరియు కామెడీ సన్నివేశాల్లో నటించి ఎంతగానో అలరించిన ప్రముఖ స్వర్గీయ నటుడు జయ ప్రకాష్ రెడ్డి తనకి సినిమా పరిశ్రమలో అత్యంత సన్నిహితుడని చెప్పుకొచ్చాడు.అంతేకాకుండా జయ ప్రకాష్ రెడ్డి ఎప్పుడు కూడా తనని మామ అని పిలిచే వాడని తమ ఇద్దరి మధ్య అంత చనువు ఉండేదని తెలిపాడు.
అయితే జయ ప్రకాష్ రెడ్డి విలన్ కన్నా కామెడీ సన్నివేశాలలోనే బాగా నటిస్తాడని అంతేకాకుండా పలు నంది అవార్డులను కూడా గెలుచుకున్నాడని చెప్పుకొచ్చాడు.

అలాగే జయ ప్రకాష్ రెడ్డి సినిమాల్లోకి రాకముందు గుంటూరు దగ్గర ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేసేవాడని ఆ సమయంలో జయ ప్రకాష్ రెడ్డి విద్యాబోధన సంస్థలకు సంబంధించి ఓ ప్రాజెక్టు చేశాడని కానీ స్వర్గీయ దర్శకుడు దాసరి నారాయణ రావు పిలిచాడని సినిమా ఇండస్ట్రీకి వచ్చాడని లేకుంటే ఆ ప్రాజెక్టు ద్వారా కోట్ల రూపాయలు ఆదాయం ఆర్జించే వాడని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.అయితే జయప్రకాష్ రెడ్డి సినిమాల్లోకి వచ్చిన తర్వాత తాను గతంలో చేసిన ప్రాజెక్టు ఫార్ములాని ఇతరులు ఉపయోగించి ప్రస్తుతం కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని కూడా తెలిపాడు.అలాగే మృతి చెందే కొద్దిరోజుల ముందు జయ ప్రకాష్ రెడ్డి తనతో మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యాడని చెప్పుకొచ్చాడు.
అలాగే సినీ పరిశ్రమలో తనకు బ్రహ్మానందం, చలపతి రావు, గిరి బాబు మరియూ ఇతర స్నేహితులు ఉన్నారని తెలిపాడు.తను ఇప్పటి వరకు ఎలాంటి కాంట్రవర్సీ లలోనూ, సమస్యలను ఎదుర్కోలేదని అదృష్టవశాత్తు ఆ దేవుడు తన పని తాను చేసుకునే గొప్ప వరాన్ని ప్రసాదించాడని ఎమోషనల్ అయ్యాడు.