మెగాస్టార్ కి అన్ని కోట్ల ఆస్తి ఉన్నా... సినిమా సెట్లో  మాత్రం... 

తెలుగులో ఇటీవలే యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన “జాతిరత్నాలు” చిత్రంలో లాయర్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ సీనియర్ నటుడు “సివిఎల్ నరసింహా రావు” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే సివిఎల్ నరసింహా రావు కేవలం నటుడిగా మాత్రమే కాకుండా పలు చిత్రాలకి రైటర్ గా, అసిస్టెంట్ దర్శకుడిగా కూడా పనిచేశాడు.

 Telugu Senior Actor Cvl Narasimha Rao About Megastar Chiranjeevi Attitude-TeluguStop.com

అంతేకాకుండా అప్పట్లో ఓ ప్రముఖ మ్యాగజైన్ సంపాదకుడిగా కూడా పని చేశాడు.అయితే తాజాగా నరసింహా రావు ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.

అయితే ఇందులో భాగంగా తాను ఇప్పటివరకు నటించిన చిత్రాలన్నింటిలోనూ ఎక్కువగా పాజిటివ్ మరియు సెంటిమెంటల్ ఓరియెంటెడ్ పాత్రలలో ఎక్కువగా  నటించానని, కానీ తనకి మాత్రం కామెడీ మరియు విలన్ ఓరియెంటెడ్ పాత్రలో నటించాలని ఉందని తన మనసులో మాటని బయటపెట్టాడు.కానీ ఇప్పటి వరకు తనకి దర్శకనిర్మాతలు మాత్రం విలన్ మరియు కామెడీ ఓరియెంటెడ్ పాత్రలని ఆఫర్ చేయడం లేదని కనీసం ఇకనైనా తాను చెప్పినటువంటి ఈ మాటలను విన్న తర్వాతయినా తనకి నచ్చిన పాత్రలు ఆఫర్ చేస్తారని ఆశించాడు.

 Telugu Senior Actor Cvl Narasimha Rao About Megastar Chiranjeevi Attitude-మెగాస్టార్ కి అన్ని కోట్ల ఆస్తి ఉన్నా… సినిమా సెట్లో  మాత్రం… -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక గతంలో తాను దాదాపుగా టాలీవుడ్ లో ఉన్నటువంటి అందరి స్టార్ హీరోల చిత్రాల్లోనూ నటించానని ఇందులో తనకు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన “ఠాగూర్” చిత్రం చాలా ప్రత్యేకమని చెప్పుకొచ్చాడు.

అయితే ఠాగూర్ చిత్రంలో చిరంజీవితో కలిసి నటిస్తున్న సమయంలో చాలా విషయాలు అర్థం చేసుకున్నానని ఇందులో ముఖ్యంగా కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నప్పటికీ మెగాస్టార్ చిరంజీవి అందరితోనూ చాలా సరదాగా ఉంటాడని, అంతేకాకుండా చిరంజీవి చిన్న, పెద్ద అనే తారతమ్యాలు లేకుండా ప్రవర్తిస్తాడని ఆ విషయం తనకు ఎంతగానో నచ్చిందని కూడా తెలిపాడు.

అలాగే సినిమా పరిశ్రమలో తాను ఎప్పుడూ కూడా ఇలాంటి పాత్రలే చేయాలని కంకణం కట్టుకోలేదని, పాత్ర ఏదైనా సరే ప్రాధాన్యత ఉంటే చాలని అనుకున్నానని అందువల్లనే ఇప్పటి వరకు కొన్ని వందల చిత్రాలలో నటించానని అభిప్రాయం వ్యక్తం చేశాడు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ మధ్య కాలంలో విడుదలైన జాతి రత్నాలు, చెక్, ప్రెషర్ కుక్కర్, అశ్వద్ధామ, తదితర చిత్రాలలో “సివిఎల్ నరసింహ రావు” ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించాడు.

#TeluguSenior #Senior Actor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు