రజినీ మానియా తగ్గిపోయింది అనడానికి ఇదే సాక్ష్యం

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌కు తెలుగులో భీభత్సమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న విషయం తెల్సిందే.రజినీ ప్రతీ చిత్రం కూడా తెలుగులో డబ్‌ అయ్యి సక్సెస్‌ అయ్యాయి.

 Telugu Rights Of Rajinikanths Petta Movie-TeluguStop.com

ఇకపోతే గతకొంత కాలంగా సీన్‌ రివర్స్‌ అయింది.వరుస చిత్రాలు పరాజయం పాలవడంతో రజినీ చిత్రాలపై తెలుగు ప్రేక్షకులకు క్రేజ్‌ సన్నగిల్లుతోంది.

‘కొచ్చాడియన్‌’, ‘లింగా’, ‘కబాలి’, ‘కాలా’ చిత్రాలను ఎంతగానో ఊహించుకున్నా అవి ఘోర పరాజయాన్ని చవి చూశాయి.దాంతో ఇక రజినీ సినిమాలకు డిమాండ్‌ తగ్గిపోయిందని అంతా భావిస్తున్నారు.

ఇటీవల విడుదలయిన ‘2.ఓ’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మంచి వసూళ్లను రాబట్టింది కాని తెలుగులో అంతంత మాత్రమే.

‘2.ఓ’ సైంటిఫిక్‌ సినిమా కాబట్టి దాని ఫలితాలు మిగతా చిత్రాలతో ప్చోలేము.గతకొంత కాలంగా రజినీ చిత్రాలు నిరాశపరుస్తుండడంతో తెలుగు రైట్స్‌ కోసం నిర్మాతలు ‘పేట’ చిత్రంపై ఆసక్తి కనబర్చడం లేదు.ఈ చిత్ర తెలుగు హక్కును ‘సర్కార్‌’ నిర్మాత కేవలం 12కోట్లలోపే తీసుకున్నట్టు సమాచారం.

రోజు రోజుకు తగ్గుతున్న రజినీ మానియేనే దీనికి కారణం.మార్కెట్‌లో ఇటీవల రజినీ చిత్రాలకు హిట్‌ కరువయ్యింది.

అందుకే ఇంత తక్కువ ధరకే తెలుగు రైట్స్‌ అమ్ముడుపోయాయి.

రజినీ చిత్రాలకు ఇటీవల సక్సెస్‌ దొరకకపోవడంతో పాటు సంక్రాంతి బరిలో ఈ చిత్రం ఉంది.తెలుగులో ఇప్పటికే సంక్రాంతికి క్రేజీ ప్రాజెక్ట్‌లు విడుదల కాబోతున్నాయి.దాంతో ఈ స్ట్రయిట్‌ చిత్రాలతో ‘పేట’ నిలవలేదు అనే కారణం కూడా ఒకటి అయి ఉండవచ్చు.

సంక్రాంతి బరిలో రాబోయే మిగతా ప్రాజెక్ట్‌లకు ప్రమోషన్‌ కార్యక్రమాలను ఇప్పటికే షురూ చేశారు.కాగా ‘పేట’ ఇంతవరకు ప్రమోషన్‌ కార్యక్రమాలు మొదలుపెట్టలేదు చేయలేదు.ఇక తెలుగులో పెద్ద సినిమాలు బరిలో ఉన్న సమయంలో ఇది నిలదొక్కుకోవడం కష్టమే అని నిర్మాతలు కాస్త చప్పగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube