ఓటీటీ విడుదలకు సిద్దమే.. కాని అదే పెద్ద మైనస్‌

తెలుగు పెద్ద బడ్జెట్‌ సినిమాలు ఇటీవల ఏ ఒక్కటి కూడా ఓటీటీ విడుదలకు సిద్దం అవ్వడం లేదు.అందుకు కారణం ఏంటీ అనే విషయమై ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

 Telugu Producers Want To Release Movies In Ott But Not Going, Ott Film , Ott Fil-TeluguStop.com

ఇప్పటి వరకు చాలా సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి.కాని గత ఏడాది మాదిరిగా ఓటీటీ విడుదల విషయంలో విముఖంగా ఉన్నారు.

ఓటీటీ రిలీజ్ కు సంబంధించిన చర్చలు అయితే జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి.కాని ఏ ఒక్కటి కూడా ప్రేక్షకుల ముందుకు రావడం లేదు.

కారణం అన్ని ఓటీటీ లు కూడా పెద్ద చిన్నా అనే తేడా లేకుండా అన్ని సినిమా లను కూడా తక్కువ మొత్తంకు కొనేయాలని ప్రయత్నాలు చేస్తున్నాయని కొత్త సినిమాలు మరియు పెద్ద సినిమా లు అన్ని కూడా తక్కువ మొత్తంకు కొనుగోలు చేయడం లేదంట వ్యూస్ అనుసారంగా పేమెంట్‌ చేస్తామంటూ తిరకాసు పెడుతున్న కారణంగా ఫిల్మ్‌ మేకర్స్ ఓటీటీ రిలీజ్ కు ఓకే చెప్పడం లేదని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం తెలుగు సినిమా లకు ఏ ఒక్క ఓటీటీ కూడా పెద్ద మొత్తంలో పెట్టేందుకు సిద్దంగా లేవు అంటున్నారు.

ఒకటి రెండు సినిమా లకు క్రేజ్ ఉంటే వాటిని కొనుగోలు చేసేందుకు ఓటీటీ లు సిద్దంగా ఉన్నా కూడా మేకర్స్ మాత్రం అమ్మేందుకు ఆసక్తిగా లేరు అంటున్నారు.మొత్తానికి ఈ వ్యవహారాలు చర్చలు బేరాలు ఏవి కూడా కుదరక పోవడం వల్ల ఓటీటీ రిలీజ్ అనేది సాధ్యం కావడం లేదు.

ముందు ముందు థియేటర్లు పునః ప్రారంభం అయ్యే అవకాశం ఉన్న కారణంగా ఓటీటీ లకు తక్కు మొత్తం కే ఎందుకు అమ్మడం అనుకుని కూడా నిర్మాతలు సినిమా లు ఓటీటీ రిలీజ్ కు వెళ్లడం లేదని సమాచారం అందుతోంది.

Telugu Makers, Ott, Telugu Ott, Theaters, Tollywood-Movie

ఓటీటీ రిలీజ్ కు ఓకే అన్నా కూడా బిజినెస్ వ్యవహారం కారణంగానే సినిమా లు విడుదల కావడం లేదని ఇండస్ట్రీకి చెందిన ఒక నిర్మాత చెప్పుకొచ్చాడు.సినిమా బిజినెస్ విషయంలోనే కొంత వ్యతిరేకత ఉన్నా నేపథ్యంలో సినిమా ల విడుదలకు జాప్యం జరుగుతుందని చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube