పిల్లలని ఎప్పుడు కనాలనేది మాకు తెలుసంటూ ఫైర్ అయిన సింగర్....

పలు టాలీవుడ్ చిత్రాలలో పాటలు పాడి తన మధురమైన గానంతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన తెలుగు ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ చిన్మయి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే సింగర్ చిన్మయి కేవలం పాటలు పాడటమే కాకుండా పలువురు స్టార్ హీరోయిన్లకు డబ్బింగ్ కూడా చెప్పి బాగానే ఆకట్టుకుంది.

 Telugu Playback Singer Chinmayi Fire On Minister Words, Telugu Playback Singer,-TeluguStop.com

అయితే ఈ మధ్యకాలంలో సింగర్ చిన్మయి కొంతమేర సమాజంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాల గురించి మరియు కష్టాల్లో ఉన్నటువంటి వారి కష్టాలు తీర్చేందుకు కూడా బాగానే స్పందిస్తోంది.అంతేకాకుండా సోషల్ మీడియా మాధ్యమాలలో తమకు తోచినంత సహాయం చేయాలంటూ తన అభిమానులకు కూడా సూచిస్తోంది.

అయితే ఈ మధ్యకాలంలో సింగర్ చిన్మయి సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ సంఘటనలపై స్పందిస్తున్న సంగతి అందరికి తెలిసిందే అయితే తాజాగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన టువంటి హోమ్ మినిస్టర్ మహిళలపై చేసినటువంటి వ్యాఖ్యలపై సింగర్ చిన్మయి ఘాటుగా స్పందించింది.అయితే మినిస్టర్ “ఈ మధ్య కాలంలో మహిళలు తమ కుటుంబ సభ్యులను కూడా వదిలిపెట్టి ఒంటరిగా బ్రతుకుతున్నారని అంతేకాకుండా కొంతమంది మహిళలు పెళ్లి చేసుకున్నప్పటికీ పిల్లల్ని కనడంలో జాప్యం చేస్తున్నారని దీంతో మహిళలకి ఒంటరిగా బ్రతకడం అలవాటయింది” అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

దీంతో తాజాగా సింగర్ చిన్మయి ఈ విషయంపై స్పందిస్తూ ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ మహిళల జీవన శైలిపై కామెంట్లు చేయడం ఫ్యాషన్ అయిపోయిందని అలాగే పెళ్లి చేసుకున్న మహిళలు పిల్లల్ని ఎప్పుడు కనాలానే విషయం తమ వ్యక్తిగతమని అంతేకాకుండా ఈ మధ్యకాలంలో పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల వల్ల కష్టాలు అనుభవిస్తున్నారని అంతేకాకుండా మగవాళ్ళు కేవలం తమ వీర్యాన్ని మాత్రమే ఇస్తారని అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.దీంతో కొందరు నెటిజనులు ఈ విషయంపై స్పందిస్తూ సింగర్ చిన్మయి చేసినటువంటి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Chinmayi, Karnataka, Telugu Playback, Teluguplayback, Pregnancy-Movie

అంతేకాకుండా భార్య భర్తల బంధంలో తమ కుటుంబ సభ్యులకు కూడా చోటు ఉండాలని అలా కాకుండా పెళ్లయిన తర్వాత తన కుటుంబ సభ్యుల నుంచి వేరుపడేట్లయితే ఇక కుటుంబ సభ్యులతో అవసరం ఏముందని అలాగే తమ పెద్దల నుంచి సంక్రమిస్తున్న ఆస్తి, డబ్బు వంటివాటిపై కూడా ఎలాంటి అధికారం కలిగి ఉండకూడదని అంటున్నారు.అలాగే పిల్లల్ని కనడం కేవలం ఆడవారి ఒక్కరి వ్యక్తిగత విషయం మాత్రమే కాదని మగవాళ్ళకి కూడా నిర్ణయం తీసుకునే హక్కు ఉంటుందని కూడా తెలియజేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube