ఆహా కోసం పెడుతున్న ఖర్చు ఎంత? వస్తున్నది ఎంతో తెలుసా?

నెట్‌ ఫ్లిక్స్‌.అమెజాన్‌ వంటి పెద్ద ఓటీటీలకు పోటీగా తెలుగు కోసం ప్రత్యేకం అంటూ ఆహాను అల్లు వారు ప్రారంభించారు.

 Telugu Ott Aha Budget And Income , Netflix, Amazon, Ott, Aha, My Home Rameshwara-TeluguStop.com

పేరు అల్లు వారిదే అయినా కూడా మొత్తం పెట్టుబడి మై హోమ్‌ రామేశ్వరావు మరియు దిల్‌ రాజు కూతురు అల్లుడిది అనేది అందరికి తెలిసిన విషయమే.అల్లు వారు తమ బ్రాండ్‌ తో ఆహా ను ప్రమోట్‌ చేయడంతో పాటు క్రియేటివ్‌ టీమ్ ను అల్లు అరవింద్ లీడ్‌ చేస్తున్నాడు.

కంటెంట్‌ కు సంబంధించిన ప్రతి విషయాన్ని అల్లు అరవింద్ చూసుకుంటున్నాడు.కరోనా కారణంగా బయటకు వెళ్ల లేక పోయినా కూడా జూమ్‌ ద్వారా ప్రతి రోజు గంటలకు గంటలు చర్చలు జరపడడంతో పాటు కథలు వింటున్నట్లుగా అల్లు అరవింద్ చెబుతున్నాడు.

మొదట మరీ లో బడ్జెట్ వెబ్‌ సిరీస్‌ లను చిన్న సినిమాలను పాత సినిమాలను స్ట్రీమింగ్‌ చేసిన ఆహా వారు భారీ ఎత్తున ఖర్చు పెడుతున్నారు.

ఆహా లో స్ట్రీమింగ్‌ అవుతున్న కంటెంట్‌ పెరిగింది.

వరుసగా కొత్త సినిమాలను తీసుకు వస్తున్నారు.పెద్ద బడ్జెట్‌ సినిమాలను తీసుకు రావడం లేదు కాని మంచి కంటెంట్‌ అనుకుంటే చిన్న బడ్జెట్‌ సినిమాలను భారీ గా ఖర్చు చేసి మరీ కొనుగోలు చేస్తున్నారు.

ఇక వెబ్‌ సిరీస్ లు మరియు షో లను కూడా ఆహా తీసుకు వస్తుంది.వాటికి కూడా భారీగా ఖర్చు చేస్తోంది.

సామ్ జామ్‌ టాక్ షో కోసం ఏకంగా నాలుగు నుండి అయిదు కోట్ల వరకు ఖర్చు చేశారని తెలుస్తోంది.ఇక వెబ్‌ సిరీస్ లను రూ.50 లక్షల నుండి మొదలుకుని రెండు కోట్ల వరకు కూడా పెట్టి కొనుగోలు చేస్తున్నారు.

Telugu Allu Aha Ott, Allu Aravind, Allu Arvind, Amazon, Rameshwarao, Netflix, Pa

ప్రస్తుతం ఆహా జాబితాలో పదుల సంఖ్యలో సినిమాలు వెబ్‌ సిరీస్ లు ఉన్నాయి.వాటన్నింటికి కూడా పదుల కోట్లు ఖర్చు చేస్తుంది.మొత్తంగా కంటెంట్‌ కోసం ఆహా వారు భారీగా ఖర్చు పెడుతున్నారు.

కాని పెట్టుబడిలో ఇప్పటి వరకు కనీసం 40 శాతం కూడా రిటర్న్‌ రాలేదు అంటున్నారు.రాబోయే మూడు నాలుగు ఏళ్లలో ఆహా ఇప్పుడు పెడుతున్న మొత్తంను వడ్డీతో సహా రాబడుతుందని వారు బలంగా నమ్ముతున్నారట.

అల్లు అరవింద్ ఆ నమ్మకంతోనే అంతగా ఖర్చు చేయిస్తున్నాడు.ఆహా చందా రేటును భారీగా పెంచడంతో పాటు పే పర్ వ్యూ కూడా తీసుకు రావడం వల్ల లాభాలు దక్కించుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube