తెలుగు అధికారికి..అరుదైన గుర్తింపు..!!!

తెలుగోడి సత్తా మరో సారి ప్రపంచ వ్యాప్తంగా మారు మోగింది.ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ అయిన ఎఫ్‌ఏవో మరియు అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి సంస్థ నిధి అయిన ఐఎఫ్‌ఏడీ అదేవిధంగా ప్రపంచ ఆహార సంస్థ(డబ్ల్యూఎఫ్‌వో)ల్లోనూ భారత దేశం తరుపున ప్రతినిధిగా తెలంగాణకి చెందిన అధికారి రాజేందర్ నియమింప బడటం నిజంగా తెలుగు రాష్ట్రాలకి ఎంతో గర్వకారణం.

 Telugu Nri Rajendar Got Placed In Fao-TeluguStop.com

జనవరి రెండో వారంలో ఆయన రోమ్‌ నగరంలో ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు.అయితే ఈయన ప్రస్తుతం కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖలో సంయుక్త కార్యదర్శిగా పని చేస్తున్నారు.వ్యవసాయ విభాగంలో ఎమ్మెస్సీ చేసిన .ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థ(ఐఏఆర్‌ఐ)లో పీహెచ్‌డీ చేశారు.

ప్రపంచ సంస్థలకి భారత్ తరుపున కీలకంగా వ్యవహరించనున్న ఆయన భారత వ్యవసాయ రంగం మరింత అభివృద్ధి చెందటానికి తనవంతు సాయం చేస్తానని ప్రకటించారు.ఆహార ఉత్పత్తుల్లో ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న నూతన పరిస్థితులని సైతం భారత్ లో ప్రవేశ పెట్టేలా చర్యలు తీసుకుంటానని ఆయన అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube