1.భారత సంతతి వ్యక్తికి ఉరి : ఆన్లైన్ వేదికగా ఉద్యమం
అక్రమ ద్రవ్యాల రమాదకవాణా కేసులో ఉరిశిక్ష పడిన భారత సంతతి వ్యక్తి కోసం సింగపూర్ లో ఆన్లైన్ వేదికగా ఉద్యమం మొదలైంది .అతడి ఉరిశిక్షను రద్దు చేయాలంటూ సంతకాల సేకరణ కూడా చేపట్టారు.
2.తెలుగు రాష్ట్రాలకు తానా భారీ విరాళం
తెలుగు రాష్ట్రాలకు అమెరికాలోని తానా 25 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించింది.వైద్య పరికరాల రూపంలో ఈ విరాళం అందించనుంది.
3.అబుదాబి లో కొత్త ట్రాఫిక్ రూల్
అబుదాబి లో కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి తీసుకువచ్చారు.భారీ శబ్దం తో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకునే విధంగా నిబంధనలు రూపొందించారు.
4.ఆఫ్రికా లోని సియోర్రా లియోస్ లో భారీ పేలుడు .91 మంది మృతి
ఆఫ్రికా లోని సియోర్రా లియోస్ లో ఇంధన టాంకర్ వద్ద భారీ పేలుడు సంభవించింది.ఈ ఘటనలో 91 మంది మృతి చెందారు.
5.తైవాన్ పై చైనా సంచలన ప్రకటన
తైవాన్ పై చైనా సంచలన ప్రకటన చేసింది.తైవాన్ కూడా చైనాలో భాగం అని ప్రకటించింది.
6.చిన్నారులకు కోవాగ్జిన్ టీకా .అమెరికాలో దరఖాస్తు
2 నుంచి 18 ఏళ్ల లోపు వారికి కూడా కోవాగ్జీన్ టీకా భారత్ బయోటెక్ తయారు చేసింది.అయితే దీనికి భారత డ్రగ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి లభించలేదు.కానీ కోవాగ్జిన్ వాడేందుకు అనుమతి కోరుతూ అమెరికా కూడా దరఖాస్తు చేసింది.
7.అమెరికాలో మ్యూజిక్ ఫెస్టివల్ లో విషాదం
అమెరికాలోని మ్యూజిక్ ఫెస్టివల్ లో విషాదం నెలకొంది. అమెరికాలోని అస్ట్రో మ్యూజిక్ ఫెస్టివల్ లో జరిగిన తొక్కిసలాటలో 8మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ ఘటన అమెరికాలోని టెక్సా స్ లోని హుస్టన్ లో జరిగింది.
8.విమాన ప్రమాదంలో ప్రముఖ గాయని మృతి
బ్రెజిల్ దేశానికి చెందిన ప్రముఖ గాయని , లాటిన్ గ్రామీ అవార్డు విజేత మారిలియా మెండొంక విమాన ప్రమాదంలో మరణించారు.
9.చైనా అధ్యక్షుడి స్నేహితుడి పై టెన్నిస్ స్టార్ ఆరోపణలు
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కు అత్యంత సన్నిహితుడైన జాంగ్ ఘోలి పై ప్రముఖ టెన్నిస్ స్టార్ పింగ్ షుయ్ లైంగిక ఆరోపణలు చేశారు.
10.డెన్వార్ జూ లో హైనాల కు కరోనా
డెన్వార్ లోని జూ లో హైనా లకు కరోనా సోకినట్టు అధికారులు నిర్ధారించారు.