తానాకి భారీ విరాళం ఇచ్చిన తెలుగు ఎన్నారై..  

Telugu Nri Large Donation For Tana-sathish Vemana,tana,telugu Nri,తానా,రవి మందలపు

అమెరికాలో తానా ప్రత్యేకతని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అమెరికా వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు ఎక్కడ ఎటువంటి బాధల్లో ఉన్నా సరే వెనువెంటనే స్పందించి నష్ట నివారణ చర్యలు చేపడుతుంది తానా. తెలుగు పండుగలు ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ , సంస్కృతీ సాంప్రదాయాలని భవిష్యత్తు తరాలకి అందించడంలో తాన కృషి అమోఘం..

తానాకి భారీ విరాళం ఇచ్చిన తెలుగు ఎన్నారై..-Telugu Nri Large Donation For Tana

అయితే తాన పార్టీ ఏటా నిర్వహించే మహా సభలకి సైతం అమెరికా వ్యాప్తంగా ఉన్న తెలుగువారు కూడా విశేషంగా స్పందిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే

అమెరికా వ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని, తానా ముఖ్య సభ్యులని కలవడానికి, తానా మహాసభలని నిర్వహించడానికి అవసరమైన నిధులని సేకరించడం కోసం తానా అధ్యక్షుడు సతీష్ వేమన పర్యటనలు చేస్తున్నారు. నగరాలు అన్నీ తిరుగుతూ నిధుల సేకరణలో విజయం సాధిస్తున్నారు.

ఈ సందర్భంలోనే ఫిలడెల్ఫీయాకు చెందిన ప్రముఖ తెలుగు ఎన్నారై రవి మందలపు తానా 22వ మహాసభలకు భారీ విరాళాన్ని ప్రకటించారు.

జులై మొదటి వారంలో వాషింగ్టన్ డీసీలో నిర్వహిస్తున్న తానా 22వ మహాసభల నిర్వహణ కోసం ఫిలడెల్ఫియాలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి తానా అధ్యక్షుడు వేమన సతీష్, సభల చైర్మన్ డా.కొడాలి నరేన్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోనే మందలపు రవి మహా సభలకోసం దాదాపు 70 లక్షల భారీ విరాళం ప్రకటించారు. దాంతో తానా అధ్యక్షుడు సతీష్ వేమన వారికి కృతజ్ఞతలు తెలిపారు.