అమెరికాలో తెలుగు ఎన్ఆర్ఐకి కీలక పదవి

అమెరికాలో భారత సంతతి సమాజంలో ప్రముఖుడు, అమెరికా తెలుగు సంఘం (ఆటా) నాయకుడు జయంత్ చల్లాకు కీలక పదవి దక్కింది.వర్జీనియాలోని స్మాల్ బిజినెస్ కమీషన్‌కు సభ్యుడిగా ఆయనను నియమిస్తూ వర్జీనియా గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు.సూక్ష్మ, చిన్న తరహా వ్యాపారాలకు సంబంధించిన సమస్యలపై అధ్యయనం చేయడంతో పాటు ప్రభుత్వానికి సిఫారసులు అందించడం ఈ కమీషన్ బాధ్యత.

 Telugu Nri Jayanth Challa Appointed To Small Business Commission Of Virginia,tel-TeluguStop.com

1988 నుంచి వర్జీనియాలో ఉంటున్న జయంత్ ప్రస్తుతం వియన్నాలో నివసిస్తున్నారు.ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ కంపెనీలలో ఆయన 30 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు.చల్లా ప్రస్తుతం.వర్జీనియాలోని రెస్టన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఏస్ ఇన్ఫో సొల్యూషన్స్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు.జర్మనీ, క్యూబాలలో మిలటరీ ఫ్యామిలీ హౌసింగ్ ప్రాజెక్టులలో స్టాఫ్ ఇంజనీర్‌గా జయంత్ తన జీవితాన్ని ప్రారంభించారు.

స్మాల్ బిజినెస్ కమీషన్‌ సభ్యుడిగా తనను నియమించడం పట్ల జయంత్ గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపారు.వర్జీనియా శాసనసభ్యులు, సెనేటర్లు, ప్రతినిధులతో కలిసి కామన్వెల్త్ ఆఫ్ వర్జీనియాలోని సుమారు 80 వేల చిన్న వ్యాపారాలకు సంబంధించిన సమస్యలపై పనిచేస్తానని ఆయన తెలిపారు.

తక్కువ పన్నులు, వ్యాపార ప్రోత్సాహకాలు, పరిశోధన, అభివృద్ది, పెట్టుబడులు వంటి అంశాలలో తెలుగువారు, భారతీయులకు చెందిన చిన్న తరహా ఐటీ వ్యాపారాలకు సాయం చేయడానికి ప్రయత్నిస్తానని జయంత్ హామీ ఇచ్చారు.మరోవైపు జయంత్‍ చల్లాను స్మాల్‍ బిజినెస్‍ కమిటీ సభ్యునిగా నియమించడంపై పలువురు తెలుగు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube