అమెరికాలో భారతీయుడి గృహనిర్భంధం..   Telugu NRI In The USA Sentenced To 8 Months House Arrest     2018-10-19   14:43:53  IST  Surya

అమెరికాలో ఆర్ధిక నేరానికి పాలపడ్డాడు అనే కారణంగా తెలుగు ఎన్నారైకి అక్కడి కోర్టు భారీ జరిమానాతో పాటు దాదాపు ఎనిమిది నెలల గృహ నిర్బంధం విధించింది..దాంతో ఈ వార్త సంచలనం సృష్టించింది. అయితే భారత పౌరుడికి ఎందుకు ఆ శిక్షని విధించింది…ఎలాంటి నేరానికి పాల్పడ్డాడు అంటే..

తెలుగు రాష్ట్రాలకి చెందిన బొంతు సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి ఎన్నో ఏళ్లుగా అమెరికాలో సెటిల్ అయ్యి ఉన్నాడు అక్కడ స్టాక్ మార్కెట్ లావాదేవీలని వ్యాపకంగా పెట్టుకున్న అతడు ఇన్ సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి.. 2003 సెప్టెంబరు నుంచి నుంచి 2018 మార్చివరకు ఈక్విఫాక్స్‌ కంపెనీలో పనిచేసిన ఆయన తన దగ్గరకు వచ్చిన సమాచారం ఆధారంగా…

Telugu NRI In The USA Sentenced To 8 Months House Arrest-

సొంతానికి షేర్లు కొనుగోలు చేసి, తక్కువ కాలంలోనే 3,500 శాతం మేర లాభం పొందారని ఎఫ్‌బీఐ ఆరోపించింది.దాంతో అతడికి అక్కడి డిస్ట్రిక్ట్‌ కోర్టు ఎనిమిది నెలల గృహ నిర్బంధం విధించింది..దాంతో పాటుగా 50 వేల డాలర్ల జరిమానా కూడా వేసింది.