అమెరికాలో హిందూ పూజారిపై దాడి..!!!  

Americans Abused To Hindu Pujari In America-

అమెరికాలో లో జాతి విద్వేష దాడులు మళ్లీ కొనసాగుతున్నాయి.గతంలో లో భారతీయుల పై అనేకసార్లు జాతి వివక్ష దాడులు జరిగిన సంఘటనలు అనేకం ఉన్నాయి.తాజాగా మరోసారి అమెరికాలో ఓ హిందూ పూజారిపై జరిగిన దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది...

Americans Abused To Hindu Pujari In America--Americans Abused To Hindu Pujari In America-

అమెరికాలోని న్యూయార్క్ లో ఫ్లోరల్ పార్క్ సమీపంలో జులై 18న ఉదయం 11 గంటల సమయంలో లో స్వామి హరీష్ చంద్ర అనే పూజారిపై ఓ వ్యక్తి దాడి చేయడంతో ఆ పూజారి తీవ్ర గాయాలపాలయ్యారు.ఈ దాడి ఘటన పరిశీలించిన పోలీసులు ఇది పూర్తిగా జాతి విద్వేష దాడే అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

Americans Abused To Hindu Pujari In America--Americans Abused To Hindu Pujari In America-

ఫ్లోరల్ పార్క్ సమీపంలోని గ్లెన్ ఒక్స్ లో శివశక్తి పీఠం ఉంది.అక్కడ దగ్గరలోని రోడ్డుపై పూజారి హరిశ్చంద్ర నడుచుకుంటూ వెళుతున్నాడు.సెర్గియో అనే 52 ఏళ్ల వ్యక్తి వెనక నుంచి వచ్చి హరిశ్చంద్ర తీవ్రంగా దాడి చేస్తూ పిడిగుద్దులు కురిపించారు.ఈ హఠాత్పరిణామంతో హరిశ్చంద్ర అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయారు.

దాంతో స్థానికంగా ఉన్న వారు దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు..

ఇదిలా ఉంటే దాడి సమయంలో సెర్గియో ఇది మా ప్రాంతం అని అరిచినట్లుగా హరిశ్చంద్ర పూరి పోలీసులకు తెలిపారు.ఈ దాడిని ప్రతినిధుల సభ సభ్యురాలైన గ్రేస్ మీనింగ్ ఖండించారు.

అమెరికాలో అతి తక్కువగా ఉన్న హిందువులకు తాను అండగా ఉంటానని ఆమె హామీ ఇచ్చారు.అయితే కొన్ని రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నలుగురు డెమొక్రటిక్ పార్టీకి చెందిన మహిళలను ఉద్దేశించి చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలిసిందే.ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే మరో జాతివివక్ష దాడి జరగడం అందరిలో భయాన్ని రేకెత్తిస్తోంది.