బిగ్ బ్రేకింగ్ : కరోనా తో అమెరికాలో ఇద్దరు తెలుగు వైద్యులు మృతి..

అమెరికాలో కరోనా బారన పడి మృతి చెందుతున్న వారిలో అమెరికన్స్ అత్యధికంగా ఉన్నారని, వలస వెళ్ళిన వారిలో కరోనా బారినపడిన మృతి చెందిన వారు ఎవరూ లేరని వస్తున్న వార్తలకి బ్రేక్ పడిందనే చెప్పాలి.తాజాగా అమెరికాలో ఇద్దరు భారత సంతతికి చెందిన తెలుగు ఎన్నారైలు కరోనా తో పోరాడి మృతి చెందారు.

 Coronavirus, Corona, Americans, Warangal, Coronaeffect,nri-TeluguStop.com

ఈ విషయం ఇప్పుడు తెలుగు ఎన్నారైలలో గుబులు రేపుతోంది.

రెండు రోజుల క్రితం అలబామా రాష్టంలోని హాంట్స్ విల్ లో ప్రముఖ సర్జన్ గా పనిచేస్తున్న డాక్టర్ .ఎరుబండి సత్యవర్ధన రావు అనే 75 ఏళ్ళ తెలుగు ఎన్నారై టెన్నిసీ రాష్ట్రంలో నాష్ విల్ లో ఉన్న వాండర్ బిల్డ్ విస్వవిదాలయానికి చెందిన ఆసుపత్రిలో కరోనాతో మృతి చెందారు.50 ఏళ్ళ క్రితమే అమెరికాలో వైద్యుడిగా స్థిరపడిన సత్యవర్ధన రావు తెలుగువారికి ఎంతో సుపరిచితులు.

అలాగే అమెరికాలోనే మరో ప్రముఖ వైద్యుడు అయిన తెలుగు ఎన్నారై డాక్టర్.అబూ అజహర్ (73) కరోనా వ్యాధి బారిన పడి మృతి చెందినట్టుగా తెలుస్తోంది.ఈయన వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజీలో వైద్య విద్యని అభ్యసించి అమెరికాలో స్థిరపదినట్టుగా తెలుస్తోంది.ఒకే రోజు ఇద్దరు ఎన్నారైలు మృతి చెందటం ఎంతో బాధాకరమని , వారి ఆత్మక శాతం కలగాలని ఎన్నారై సంఘాలు సంతాపం ప్రకటించాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube