80 ఏళ్లకోసారి వైరస్‌లు కామన్.. కరోనాకు త్వరలోనే వ్యాక్సిన్: డాక్టర్ నోరి దత్తాత్రేయుడు  

Telugu Nri Doctor Nori Dattatreyudu Corona Vaccine - Telugu Corona Cases, Corona Vaccine, India, Nori Dattatreyudu, Telugu Nri Doctor Nori Dattatreyudu Comments About Corona Vaccine

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కోసం అన్ని దేశాలకు చెందిన పరిశోధకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.అన్ని చోట్లా ట్రయల్స్ వరకు వచ్చాయన్న వార్తలు తప్పించి సక్సెస్ అయిందన్న మాట మాత్రం వినిపించడం లేదు.

 Telugu Nri Doctor Nori Dattatreyudu Corona Vaccine

ఎలా లేదన్న టీకాకు తుదిరూపు వచ్చే సరికి ఏడాది సమయం పట్టే అవకాశం ఉంటుందని పరిశోధకులు అంటున్నారు.ఈ నేపథ్యంలో తెలుగు ఎన్ఆర్ఐ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు వ్యాక్సిన్‌పై స్పందించారు.

కోవిడ్ 19ను నివారించే టీకా మూడు, నాలుగు నెలల్లో అందుబాటులోకి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.మానవ చరిత్రలో ప్రతి 70 నుంచి 80 ఏళ్లకు ఓ వైరస్ విరుచుకుపడుతుందని, అంటువ్యాధులు ప్రబలి జనం ఆందోళనకు గురవుతుంటారని వాటికి వ్యాక్సిన్లు సైతం కనిపెడుతూనే ఉంటారని దత్తాత్రేయుడు గుర్తుచేశారు.

80 ఏళ్లకోసారి వైరస్‌లు కామన్.. కరోనాకు త్వరలోనే వ్యాక్సిన్: డాక్టర్ నోరి దత్తాత్రేయుడు-Telugu NRI-Telugu Tollywood Photo Image

కాకపోతే ఇప్పటి వరకు వచ్చిన వైరస్‌లలో కరోనా వైరస్ దూకుడు ఎక్కువగా ఉందని, దీనికి కళ్లెం వేసేందుకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల శాస్త్రవేత్తలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని నోరి తెలిపారు.

ఇక భారత్‌లో కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆయన స్పందిస్తూ.

న్యూయార్క్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితులను భారత ప్రభుత్వం గుణపాఠంగా తీసుకోవాలని దత్తాత్రేయుడు సూచించారు.తరచూ శరీరాన్ని శుభ్రం చేసుకుంటూ, భౌతిక దూరం పాటించడమే తాత్కాలికంగా కరోనాకు మందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణయం మంచిదేనని, ఇండియాలో కేసుల సంఖ్య లక్షల్లో చేరితే, వైద్య సదుపాయాలు అందించేందుకు సరిపడా ఆసుపత్రులు లేవని నోరి చెప్పారు.

గ్రామీణ స్థాయిలో మరింత మందికి పరీక్షలు జరగాల్సి వుందని నోరి చెప్పారు.భారత ప్రభుత్వం అనుమతిస్తే, అమెరికాలో ఉన్న భారత సంతతి వైద్యులు మనదేశంలో వైద్య సేవలు అందిస్తారని తెలిపారు.పొగతాగేవారు, మద్యం తాగేవారు, 70 ఏళ్లు పైబడిన వారు వైరస్ బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇక తాత్కాలికంగా కరోనా రోగులుకు ఇస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్, రెమిడీసివిర్ గురించి నోరి స్పందించారు.ప్రస్తుతానికి రెమిడీసివిర్ సత్ఫలితాలను ఇస్తోందని, రెండు వారాల్లో కోలుకునే రోగులు, ఈ మందుతో వారం రోజులకే కోలుకుని ఇంటికి వెళుతున్నారని దత్తాత్రేయుడు వ్యాఖ్యానించారు.

అయితే హైడ్రాక్సీక్లోరోక్విన్ బిళ్లలు ఏ మేరకు ప్రభావం చూపిస్తాయన్న విషయంలో ఇంకా పూర్తి స్పష్టత రాలేదని దత్తాత్రేయుడు అన్నారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Telugu Nri Doctor Nori Dattatreyudu Corona Vaccine Related Telugu News,Photos/Pics,Images..